News
News
X

Wife Caught Husband: ఇంట్లో ఇల్లాలు - హోటల్లో ప్రియురాలు, సినిమా లెవెల్ స్టోరీ!

Wife Caught Husband: అతడో గ్రామ సచివాలయ ఉద్యోగి. ఇంట్లో పెళ్లాం ఉండగా హోటల్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేశాడు. కానీ భార్య అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

FOLLOW US: 

Wife Caught Husband: ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చాలా మంది చూసే ఉంటారు. భార్య ఉండగా, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తారు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తారు. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా.. పెళ్లాం ఉండగా ఇతర మహిళలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. 

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది..

అతనో గ్రామ సచివాలయ ఉద్యోగి. మంచి ఉద్యోగంలో ఉన్న అతడు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మరో మహిళతో చనువుగా ఉంటూ, తరచూ ఆమె దగ్గరికి వెళ్తుండే వాడు. హోటల్ గది మాట్లాడుకుని ఇద్దరూ బాగా ఎంజాయ్ చేసే వారు. అయితే భర్తలో వచ్చిన మార్పులు అతడి భార్య గమనించింది. ఏదో తేడాగా ఉందని పసిగట్టింది. భర్త రాసలీలలు గురించి ఆరా తీసింది. భర్త మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది భార్య. భర్తపై నిఘా పెట్టింది. ఆ మహిళ దగ్గరికి వెళ్తాడని ముందు పసిగట్టిన భార్య.. అతడిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్లినా ఫాలో అయ్యేది. ఈ క్రమంలోనే అతడు తన ప్రియురాలిని కలిసేందుకు హోటల్ కు వెళ్లాడు. హోటల్ గదిలో వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. 

వెంకటేష్ ప్రవర్తనలో మార్పులు..

నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన చలం వెంకటేష్.. తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. వెంకటేష్ కు కొంత కాలం క్రితం సుమ చందు అనే మహిళతో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం భారీగానే ఇచ్చారు అత్తా మామలు. అతడికి ఆ విషయంలో ఏ లోటూ రానివ్వ లేదు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కూతురును ఇచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు. వివాహం జరిగిన కొన్ని రోజుల పాటు భార్యతో బాగానే ఉన్నాడు వెంకటేష్. తర్వాత తన నిజ స్వరూపం బయట పెట్టాడు. భార్యను దగ్గరకు రానివ్వలేదు. ఎప్పుడూ దూరం దూరంగా ఉంటుండే వాడు. ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడటం, ఛాటింగ్ లు చేసేవాడు. భర్త ప్రవర్తనలో మార్పులు గమనించింది భార్య. అప్పుడే ఆమెకు ఏదో తేడాగా అనిపించింది. 

భార్య ఉండగా మరో మహిళతో ప్రేమాయణం..

మొగుడిపై అనుమానం వచ్చిన సుమ అతడిపై నిఘా పెట్టింది. వెంకటేష్ మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకుంది. 15 రోజుల క్రితం నెల్లూరులోని తన భర్త మరో మహిళతో మకాం పెట్టాడని తెలుసుకుంది. వారు ఉండే హోటల్ గదికి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి వెళ్లింది. అదే సమయంలో వారు ఆ కార్యంలో తలమునకలయ్యారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది సుమ. సచివాలయం రిజిస్ట్రార్ లో విధులకు హాజరు అయినట్లుగా సంతకం పెట్టి.. హోటల్ కు వచ్చే వాడు వెంకటేష్. ప్రియురాలితో హోటల్ లో సరస కలాపాలు సాగించే వాడు. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది భార్య సుమ. వారు వచ్చి వెంకటేష్ పై కేసు నమోదు చేశారు. 

Published at : 31 Jul 2022 07:33 AM (IST) Tags: wife caught husband Man Extra Marital Affair Latest Illegal Affair in Nellore Nellore Latest Crime News Wife Beaten Her Husband

సంబంధిత కథనాలు

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

టాప్ స్టోరీస్

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!