Fake Currency: మేడారం జాతర కోసం కేటుగాళ్ల ప్రిపరేషన్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి భారీ స్కెచ్

యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారు చేశారు. పురాతన వస్తువులను క్రియేట్ చేశారు. కానీ పోలీసులు నుంచి మాత్రం తప్పించుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోయారు.

FOLLOW US: 

డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠా గుట్టును రట్టు చేశారు వరంగల్ పోలీసులు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వర్ధన్నపేట పోలీసులు కలిసి ఈ ముఠా బండారాన్ని బయటపెట్టారు. నలుగురిని అరెస్టు చేశారు. 

 అరెస్టైన నలుగురు సభ్యుల నుంచి 26లక్షల 80వేల రూపాయల విలుగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రవణాలు, రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో వనపర్తి జిల్లాకు చెందిన ముమ్మాడి ధనుంజయ( 29),  గుట్టా హరిప్రసాద్ రెడ్డి (24), గడ్డం (28), చల్లా మహేష్ ఉన్నారు.

పరారీలో ఉన్న నిందితులు: రాజు (వర్ధన్నపేట), అశోక్ (పెద్దమ్మగడ్డ), కిషన్ (కామారెడ్డి), సతీష్ (మహబూబాబాద్)

పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నలుపు రంగులో ఉన్న కరెన్సీ సైజ్‌ కాగితాలను బ్యాగుల్లో పెట్టుకొని తిరుగుతారు. ఎవరికైతే నకిలీ కరెన్సీ కావాలో వాళ్ల కళ్ల ముందే ఆ నోట్లను రసాయనాల్లో ముంచి నకిలీ రెండువేల రూపాయల కరెన్సీని తయారు చేసి ఇచ్చేస్తారు. 

ఈ ప్రక్రియను వీడియోల రూపంలో మార్చేసి నకిలీ నోట్లు చెలామణి చేసేవాళ్లకు అందజేస్తారు. వీళ్లు ఇచ్చే నలుపు కాగితాలను నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి నకిలీ కరెన్సీ తయారు చేసుకోవాలని సలహా ఇస్తారు. వీళ్లు పంపించే వీడియోలు చూసి తయారు చేసుకోమని చెప్తారు. 

ఒరిజినల్ కరెన్సీ రూ. 50వేలు ఇస్తే లక్షా యాభైవేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తుంటారు. ఇలా సాగిపోయేది ఈ దందా. ఇదే కాదు వీళ్లకు ఓ సైడ్ బిజినెస్‌ కూడా ఉంది. యూట్యూబ్ వీడియోలు చూసి జనాలను మోసం చేసేవాళ్లు. 

బహిరంగ మార్కెట్లో దొరికే రాగి పాత్రలు, గోపురం కలశాలు, రాగి నాణేలను వివిధ రసాయలతో వాటి ఒరిజినల్ కలర్‌ మార్చేసి పురాతన వస్తువులుగా కలరింగ్ ఇచ్చేసి అమ్మేసేవాళ్లు. ఆ పాత్రల్లో, కలుశాలలో బ్యాటరీలు అమర్చి రాగి సహా ఇతర వస్తువులను ఆకర్షిస్తున్నాయని నమ్మించేవాళ్లు. ఇలాంటి వాటిన్నింటినీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని జనాలకు టోపీ పెట్టేవాళ్లు. ఇంట్లో ప్రాక్టీస్ చేసిన వీడియోలను జనాలకు చూపిస్తూ ఏమార్చి సొమ్ము చేసుకునేదీ ముఠా. 

నిందితులైన ధనుంజయ్, హరిప్రసాద్ రెడ్డి, మహేష్ వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వద్ద నాగరాజుకు డమ్మీ నోట్లను ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. దీన్ని ముందే పసిగట్టిన పోలీసులు అక్కడే కాపు కాశారు. అనుకున్నట్టుగానే ముగ్గురు అంబేద్కర్ సెంటర్‌కు వచ్చారు. నోట్లు మార్పిడి చేస్తున్న టైంలో పోలీసులు అటాక్ చేశారు. 

నిందితులు పట్టుకొని విచారించగా మోసాల గుట్టు బయటపడింది. మేడారం జాతరను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్లను భారీగా మార్చేందుకు ఈ ముఠా ప్లాన్ చేసింది. పోలీసులు పసిగట్టి వీళ్లను అరెస్టు చేయడంతో అసలు సంగతి వెల్గు చూసింది. 

మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇలాంటి మోసాగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరూ ఏదీ ఊరికే ఇవ్వరని.. అలా ఎవరైనా ఇచ్చినట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే డబ్బును కోల్పోవడమే కాకుండా కేసుల్లో ఇరుక్కునే ఛాన్స్ ఉందంటు హెచ్చరిస్తున్నారు.  

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్లు  శ్రీనివాస్ జీ, సంతోష్, వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ సాధన్ కుమార్, వర్ధన్నపేట ఎస్.ఐ రామారావు, టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ ప్రేమానందం, ఏ.ఏ.ఓ సల్మాన్ పాషా, టాస్క్ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీకాంత్, సృజన్, మహెందర్, ఆలీ, డ్రైవర్ శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Published at : 09 Feb 2022 03:06 PM (IST) Tags: warangal news fake currency warangal police Vardhannapeta News You Tube Videos

సంబంధిత కథనాలు

Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !

Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !

Himachal Pradesh Bus accident: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 16 మంది మృతి!

Himachal Pradesh Bus accident: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 16 మంది మృతి!

Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి

Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

టాప్ స్టోరీస్

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Hyderabad As Bhagyanagar: ప్రధాని మోదీ నోట వినిపించని హైదరాబాద్‌ మాట, పేరు మార్పునకు సంకేతమా?

Hyderabad As Bhagyanagar: ప్రధాని మోదీ నోట వినిపించని హైదరాబాద్‌ మాట, పేరు మార్పునకు సంకేతమా?