By: ABP Desam | Updated at : 12 Apr 2022 02:57 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
Warangal Fire : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన టెస్కో కంపెనీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్ క్లాతులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.38 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు అందించాల్సిన దుస్తులు
టెస్కో గోదాంలో భారీగా మంటలు ఎగిసిడుతున్నాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ మంటల వల్ల గోదాం గోడలు కూడా పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.38 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన చేనేత దుస్తులు నిల్వ చేశారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉండగా కరోనా కారణంగా జాప్యం జరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై వాచ్‌మెన్ సమాచారం ఇవ్వడంతో గోదాం ఇన్‌ఛార్జి శ్రీనివాస్, డీఎంవో శ్రీనివాస్ ప్రమాదస్థలికి చేరుకున్నారు. వరంగల్ నుంచి మరో నాలుగు ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కంటెయినర్ లో అగ్ని ప్రమాదం
ఎలక్ట్రిక్ వాహనాల కంటెయినర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 20కి పైగా స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలను నాసిక్ కు రవాణా చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జితేంద్ర కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. స్కూటర్లను రవాణా చేసేటప్పులు అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయలో కంటెయినర్ లో దాదాపు 40 స్కూటర్లు ఉన్నాయి. ఈ క్రమంలో 20 వాహనాలకు మంటలు అంటున్నారు. ఈ సంఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పూణెలో ఉన్న హెగావ్ ప్రాంతంలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చేలరేగి కంటెయినర్ అంతటా మంటలు వ్యాపించాయి. లిథియం, అయాన్ బ్యాటరీ వలన అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావించారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియర్ ఆఫీస్లపై పోలీసుల నిఘా
Goa News: గోవా బీచ్లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?