వాకింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన కార్, వీల్స్ కింద పడి నలిగిపోయి వృద్ధురాలి మృతి
Viral Video: నోయిడాలో ఓ వృద్ధురాలు వాకింగ్ చేస్తుండగా కార్ వచ్చి ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Viral Video:
నోయిడాలో దారుణం..
నోయిడాలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధురాలిపై కార్ దూసుకుపోయింది. చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆ వృద్ధురాలు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల కింద పడిపోయింది బాధితురాలు. అదే వేగంతో ఆమెపైకి కార్ దూసుకుపోయింది. అక్కడి సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నోయిడాలోని సెక్టార్ 78లో బాధితురాలు కృష్ణ నరంగ్ వాకింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయిన వెంటనే చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారిగా అక్కడ గుమి గూడారు. కార్ డ్రైవర్ ఆమెని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అందిస్తుండగా బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా...వైద్యులూ ఆమెని కాపాడలేకపోయారు. తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"వృద్ధురాలు కాంప్లెక్స్ లోపల వాకింగ్ చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఓ కార్ బేస్‌మెంట్‌లో నుంచి వేగంగా దూసుకొచ్చింది. ఆమెని ఢీకొట్టింది. వెంటనే ఆమె రోడ్డుపై పడిపోయింది. అప్పటికీ కార్ కంట్రోల్ అవ్వలేదు. నేరుగా ఆమె తలపై నుంచి ముందు చక్రాలు దూసుకెళ్లాయి. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. కార్ డ్రైవర్ ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. కాసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది"
- నోయిడా పోలీసులు
#India. An old lady who lives in Mahagun Moderne, Sector 78, Noida was going for her usual society temple walk in the evening of XUV 700 Car mows down old lady to death in Mahagun Moderne, Noida on 11.10.2023. pic.twitter.com/EuqwGD7WHl
— TruthForEarth (@TruthForEarth) October 13, 2023
ఢిల్లీలో ఇటీవలే దారుణమైన ఘటన జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ని ఓ కార్ ఢీకొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకూ రోడ్డుపై లాక్కెళ్లింది. వెనకాల వచ్చే కార్లో ఉన్న కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి 11.30 గంటలకు నడి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నాడు బాధితుడు. ఫరియాబాద్‌కి చెందిన బిజేంద్రగా గుర్తించారు. క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ ఇలా ఎందుకు చిక్కుకుపోయాడు..? రోడ్డుపై అతణ్ని ఎందుకలా లాక్కెళ్లారు..? అని పోలీసులు విచారించారు. ఈ విచారణలో తేలిందేంటంటే...బిజేంద్ర నడుపుతున్న క్యాబ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు బిజేంద్ర. అడ్డు తొలగించుకునేందుకు గట్టిగా కార్‌తో ఢీకొట్టారు దుండగులు. అప్పుడే కార్ వెనకాల చిక్కుకున్నాడు. అది పట్టించుకోకుండా దాదాపు 200 మీటర్ల వరకూ అలానే లాక్కుని వెళ్లారు. కొంత దూరం తరవాత రోడ్డుపై పడిపోయాడు బిజేంద్ర. అప్పటికే తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు.
Flash: (Disturbing Visuals)
— Yuvraj Singh Mann (@yuvnique) October 11, 2023
A viral video shows body of a man being dragged by car in #Delhi. The body of an unidentified male with injuries was found near service road of NH8 on 10th October.
The person was identified as a taxi driver with residence in #Haryana's Faridabad.… pic.twitter.com/PZelXCC3xx
Also Read: గాజాలో శిథిలాల కింద నలిగిపోయిన మహిళ, చేయి ఊపుతూ సాయం కోసం అభ్యర్థన - గుండెని మెలిపెట్టే దృశ్యాలు