Madhya Pradesh: వాయిస్ మార్చే యాప్‌తో బాలికలకు వల, స్కాలర్‌షిప్ ఇస్తానని పిలిపించి అత్యాచారం
Madhya Pradesh News: గొంతు మార్చే యాప్‌తో బాలికల్ని ట్రాప్ చేసి స్కాలర్‌షిప్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి ఏడుగురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Telugu News: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రొఫెసర్ గొంతు మార్చే యాప్‌తో బాలికలను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకుని కలిసి ఆ తరవాత దారుణానికి ఒడిగట్టాడు. ఏడుగురు బాలికలపై అఘాయిత్యం చేశాడు. స్కాలర్‌షిప్‌లు ఇస్తానని చెప్పి వాళ్లపై అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఓ మహిళా కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్టు చెప్పి తమపై అత్యాచారం చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. వాళ్లలో నలుగురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరవాత ముగ్గురు కూడా ముందుకొచ్చారు. నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు ఆ తరవాత అరెస్ట్ చేశారు. ఈ బాలికల ఫోన్ నంబర్లు నిందితుడికి ఇచ్చిన వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. వాయిస్ ఛేంజింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ట్రాప్ చేశాడు. బాధితులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే అని పోలీసులు వెల్లడించారు.
"బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశాం. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. యాప్ స్టోర్‌లో వాయిస్ ఛేంజింగ్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లేడీ ప్రొఫెసర్‌గా నమ్మించి మోసం చేశాడు. వాళ్లకి స్కాలర్‌షిప్ ఇస్తామని ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితులంతా గిరిజనులే. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లే"
- పోలీసులు
బాధితుల్లో మహిళలతో పాటు బాలికలూ ఉన్నందున నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు వాయిస్ ఛేంజింగ్ యాప్‌ని ఎలా వాడాలో యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడని తెలిపారు. ఇద్దరి సాయంతో మహిళలు, బాలికల నంబర్‌లు సేకరించాడు. తన ఇంట్లోనే స్కాలర్‌షిప్ ఇస్తానని నమ్మించి ఓ చోటకు పిలిపించాడు. ఓ మారుమూల ప్రాంతానికి రప్పించి అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫోన్‌లనూ లాక్కున్నాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కొంత మంది మహిళల నంబర్‌లు సేకరించి ర్యాండమ్‌గా కొంత మందికి కనీసం 10-20 సార్లు ఫోన్ కాల్ చేస్తాడు. స్కాలర్‌షిప్ వద్దంటే వేరే గవర్నమెంట్ స్కీమ్స్‌లో చేరుస్తానని చెప్పి ఆశపెట్టి ఇలా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.