By: ABP Desam | Updated at : 28 Mar 2022 02:12 PM (IST)
కారును ఢీకొన్న బస్సు
Kamareddy Bus Car Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మాచారెడ్డి (Machareddy) మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న (TSRTC Bus - Car colloids) ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు నెంబరును పరిశీలించి మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Crime News: విక్రమార్కుడు సినిమాలో రవితేజ లెక్క చేసింది- అక్కడ గుండుతోనే పోయింది- ఇక్కడ మాత్రం?
Political Cheating : పార్టీలో చేరితే చాలు ఇల్లు, ఫ్లాట్లట - తీరా చేరిన తర్వాత !
Saral Vastu Chandrashekhar Guruji : "సరళ వాస్తు" చంద్రశేఖర్ గురూజీ హత్య - కర్ణాటకలో దారుణం !
Crime News Cheating : కోటి లాటరి అని ఆశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది - ఈ మోసగాళ్లు చాలా డేంజర్ !
Nizamabad News: మాస్క్ ఒక్కటే క్లూ- పోలీసులకు సవాల్గా నిజామాబాద్ బ్యాంక్ దోపిడీ కేసు
EV Fire Incidents: తయారీ లోపంతోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు- తేల్చిన కేంద్రం - నెలరోజుల్లో చర్యలు !
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?
Rain Alert: నేడు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఏపీ, తెలంగాణకు IMD ఎల్లో అలర్ట్