అన్వేషించండి

Toronto Shooting: కెనడాలో కాల్పుల కలకలం, ఐదుగురు మృతి - అనుమానితుడిని కాల్చేసిన పోలీసులు

Toronto Shooting: కెనడాలోని టొరంటోలో కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Toronto Shooting:

ఐదుగురు మృతి..

కెనడాలోని టొరొంటోలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే...కాల్పులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ఫైరింగ్ జరపగా...అతనూ ప్రాణాలు కోల్పోయాడు. "ఈ ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడిపై కాల్పులు జరిపాం. ఆ వ్యక్తి మృతి చెందాడు. మొత్తం ఆరుగురు చనిపోగా...వీరిలో 5గురు సామాన్య పౌరులు"అని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రస్తుతం చికిత్సపొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ...బతికే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది.  ఓ బిల్డింగ్‌  సమీపంలో ఈ కాల్పులు జరగటం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు వారికి సర్ది చెప్పి ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. నిజానికి..టొరంటోలో ఇలాంటి ఘటనలు జరగటం చాలా అరుదు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకుంది ఈ సిటీ. అలాంటిది..ఇక్కడ  ఈ స్థాయిలో కాల్పులు జరగడం అందరినీ కలవరానికి గురి చేసింది. క్రమంగా కెనడా కూడా అమెరికాలాగా మారిపోతోందేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్ కల్చర్ పెరుగుతుందేమోనని అనుమానిస్తున్నారు. 

అమెరికాలో గన్‌ కల్చర్..

అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ 
ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. గన్ వయలెన్స్ ద్వారా చనిపోతున్న వారిలో 14% మహిళలే ఉంటున్నారు. గతేడాది లెక్కలు చూస్తే..ప్రతి లక్ష మంది అమెరికన్ మహిళలకు ఏడుగురు తుపాకీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఈ సంఖ్య 4గా ఉంది. 

Also Read: Ban Halal Meat: ఆ రాష్ట్రంలో హలాల్‌ మాంసంపై నిషేధం, చట్టం చేయనున్న ప్రభుత్వం!

టాప్ హెడ్ లైన్స్

CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Embed widget