News
News
X

Tirupati Students Missing: తిరుపతిలో ఐదుగురు విద్యార్థుల అదృశ్యం- టెన్షన్ పడుతున్న పేరెంట్స్ !

Tirupati Students Missing: తిరుపతిలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు, తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి అదృశ్యం అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

FOLLOW US: 
 
Tirupati Students Missing: తిరుపతిలోని అన్నమయ్య ఇంగ్లిషు మీడియం స్కూల్లో చదువుతున్న ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు  అదృశ్యం అయ్యారు. గుణశ్రీ, మెహతాజ్, మౌనశ్రీ, అబ్దుల్ రెహ్మాన్ పదో తరగతి చదువుతుండగా.. అతీఫ్ హుస్సేన్ 9వ తరగతి చదువుతున్నారు. ఉదయం 6 గంటలకు స్టడీ అవర్స్ అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు... ఉదయం 8 గం.లకు టిఫిన్ చేసేందుకు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్తూ దారి మధ్యలో నలుగురు కలిసి ఎటో వెళ్లిపోయారు. ఎంతకీ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులుల బడికి ఫోన్ చేశారు. పిల్లలు చాలా సేపటి క్రితమే బడి నుంచి వెళ్లిపోయారని చెప్పగా పిల్లలను వెతకడం ప్రారంభించారు. స్నేహితులు, తెలిసిన వాళ్ల ఇళ్లలో వెళ్లి చూడగా ఆచూకీ లభించలేదు. 

దీంతో పిల్లలకు ఏమైపోయిందో అని భావించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలు కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఓ వైపు బడిలోని తోటి పిల్లలను విచారించారు. మరోవైపు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే అదృశ్యమైన విద్యార్థులంతా గత రెండు రోజుల నుంచి తిరుపతి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ఇటీవలే విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం..

News Reels

విశాఖపట్నంలో కూడా ఈ మధ్య నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తమ కోసం వెతకొద్దని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసుు వెంటనే టీమ్‌లను ఏర్పాటు చేసి వారిని పట్టుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

విశాఖపట్నంలోని క్వీన్ మేరీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. రోజూలాగే బడికి వెళ్లిన అమ్మాయిలు సాయంత్రం దాటినా ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. స్నేహితులు, తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసినా ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. దీంతో ముందుగా పాఠశాల యాజమన్యానికి విషయం తెలియజేశారు. అయితే అదృశ్యం అయింది మొత్తం నలుగురు విద్యార్థినులు అని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. వీరంతా కలిసి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కూతుళ్లు కనిపించడం లేదని.. వెంటనే వాళ్లని వెతికి పట్టుకోవాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా ముందుగా పోలీసులు పాఠశాలకు వెళ్లారు. వాళ్లకు అక్కడ విద్యార్థినులు రాసిన ఓ లేఖ లభ్యం అయింది. అందులో ఆ విద్యార్థులు తమ జీవితాల కోసమే మాత్రమే తాము దూరంగా వెళ్లిపోతున్నట్లు తెలిపారు. మేము ఎవరితో వెళ్లట్లేదు.. మాకోసం, మా జీవితాలు బాగయ్యేందు కోసం మాత్రమే వెళ్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని పోలీసు గ్రూపులను,  వాలంటరి గ్రూపులను అలర్ట్ చేశారు. అమ్మాయిల జాడ కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొన్నారు. వన్ టౌన్ పోలీసులు వద్ద ఉన్న సీసీ కెమెరా వీడియోలో నలుగురు విద్యార్థినులు స్వచ్ఛందంగా వెళ్ళినట్టు ఆధారాలు సైతం ఉన్నాయని స్థానిక సీఐ వెల్లడించారు. 

క్వీన్ మేరీ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చదువు ఒత్తిడి తట్టుకోలేక, సినిమాలు, యూట్యూట్‌ వీడియోలు ప్రభావంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. 

Published at : 09 Nov 2022 03:47 PM (IST) Tags: AP Crime news Tirupati News Students Missing Tirupati Students Missing Annamayya School Students

సంబంధిత కథనాలు

Vijayawada News: సాల్ట్ పథకం పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపీ, కోట్లలో మోసం!

Vijayawada News: సాల్ట్ పథకం పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపీ, కోట్లలో మోసం!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Hyderabad Crime News: హెచ్సీయూలో ఉద్రిక్తత- కీచక ప్రొఫెసర్‌ అరెస్టుకు విద్యార్థుల డిమాండ్

Hyderabad Crime News: హెచ్సీయూలో ఉద్రిక్తత- కీచక ప్రొఫెసర్‌ అరెస్టుకు విద్యార్థుల డిమాండ్

టీటీడీ బోర్డు మెంబర్‌ రియల్ మోసం- అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

టీటీడీ బోర్డు మెంబర్‌ రియల్ మోసం- అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా