News
News
వీడియోలు ఆటలు
X

Red Sandalwood Smugglers: ఎర్రచందనం కూలీలను పోలీసుల కళ్లుగప్పి డ్రైవర్, కండక్టర్ ఎలా తప్పించారంటే ! 

Red Sandalwood Smuggling In Chittor: ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రణాళికలు వేసినా వాటిని చిత్తు చేసి స్మగ్లింగ్ సాగిస్తున్నారు

FOLLOW US: 
Share:

Red Sandalwood Smugglers: ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు, అటవీ శాఖా అధికారులు ఎన్ని ప్రణాళికలు వేసినా వాటిని చిత్తు చేసి మరీ స్మగ్లింగ్ సాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా పోలీసులకు రోజు రోజుకి సవాల్ మారుంది. జిల్లాకు నలువైపుల చెక్ పోస్టులు ఏ చిన్న అనుమానం వచ్చినా క్షుణ్ణంగా తనిఖీ చేసే సిబ్బంది.. కానీ పోలీసులనే బురిడీ కొట్టించి మరి రోజుకొక్క వినూత్న ఆలోచనతో ఎర్రచందన స్మగ్లర్స్ రెచ్చి పోతున్నారు.. తాజాగా చిత్తూరు జిల్లాలో పెండ్లీ వారంమండీ అంటూ బస్సు ఎక్కి పోలీసులకు టోకరా కొట్టి తప్పించుకున్నారు.. అసలు పోలీసుల నుండి 36 మంది స్మగ్లర్స్ ఎలా తప్పించుకున్నారంటే...???

వివరాల్లోకి వెళతే... తిరుపతి నుండి తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూర్‌‌కు TN 23 N 2327 తమిళనాడు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. తిరుపతి నుండి బయలుదేరిన ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా 36 మంది తమిళనాడుకు చెందిన వారు పెళ్లి బృందంగా ప్రయాణిస్తున్నారు. ఇంతలో పోలీసులకు వచ్చిన రహస్య సమచారం మేరకు ఆ బస్సును వెతికే పనిలో పడ్డారు చంద్రగిరి పోలీసులు. చివరికి బస్సు ఆచూకీ గుర్తించారు. బస్సు వెళ్ళే మార్గంలో పోలీసు వాహనం వస్తుంది. పోలీసు వాహనం వస్తుందని సమాచారం అందుకున్న బస్సు డ్రైవర్ అప్రమత్తం అయ్యి బస్సును మరింత వేగంగా నడిపారు.. పోలీసుల నుండి తప్పించుకునేందుకు అతివేగంగా వెళ్లి చంద్రగిరికి సమీపంలోని తన్నుపల్లె క్రాస్ వద్ద బస్సులో‌ ఉన్న పెండ్లి బృందంను దింపారు.

అక్కడి నుంచి పరారవ్వాలని పెళ్లి బృందాన్ని బస్సులోని డ్రైవర్, కండక్టర్ అలర్ట్ చేశారు. అంతే క్షణాల్లో బస్సు ఖాళీ అయిపోయింది. నిమిషాల వ్యవధిలోనే బస్సు దిగి ఎక్కడి వారు అక్కడ పరారయ్యారు. బస్సులో ఉన్న గిఫ్ట్ లు కూడా ఎత్తుకుని మరి ఆ పెంళ్లి బృందం వెళ్లిపోయింది. అక్కడి నుండి హడావుడిగా బస్సును కదిలించాడు డ్రైవర్. ఇంతలో పోలీసు వాహనం బస్సును వేంబడించే ప్రయత్నం చేసింది. బస్సును ప్రక్కకు ఆపాలని సూచనలు ఇవ్వడంతో ఆ తమిళనాడు డ్రైవర్ బస్సును ప్రక్కకు ఆపి ఏమైందని ఎందుకు తమను ఆపారని పోలీసులను ప్రశ్నించారు. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పొలీసులు బస్సులోని పెళ్లి ‌బృందం ఎక్కడా అని ప్రశ్నించగా.. తమకు ఏమి తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

దొరికిపోతామనే భయంతో బస్సును అక్కడే వదిలి తమిళనాడు డ్రైవర్, కండక్టర్‌లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో పాటు బస్సును చంద్రగిరి పోలీసు స్టేషనుకు తరలించారు. బస్సు డ్రైవర్ కండక్టర్ ని విచారించగా పోలీసులి ఆశ్చర్యపోయే విషయం బయటకు వచ్చింది. వారంతా పెళ్లి ‌బృందం కాదని, ఎర్రచందనం కూలీలని.. తమిళనాడు నుండి వచ్చి చెట్లను నరికి తిరుగు ప్రయాణంలో వారిని తమిళనాడులోని తిరుపత్తూర్‌కు తరలించేందుకు ఎవరికి అనుమానం రాకుండా మారువేషాలతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు డ్రైవర్ వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 36 మంది ఎర్రకూలీల వేటలో పడ్డారు. తన్నుపల్లె క్రాస్ సమీప ప్రాంతాలను క్షుణ్ణంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడు బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు తమిళ కూలీలను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. 

Also Read: Weather Updates Today: హీటెక్కుతున్న ఏపీ, కొన్ని జిల్లాల్లో వర్షాలతో కూల్ కూల్‌గా తెలంగాణ 

Also Read: Teacher Crime: సోషల్ టీచర్ పాడు పని, ఉపాధ్యాయిని నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు, మరో కిలాడీ పని!

Published at : 11 Feb 2022 07:53 AM (IST) Tags: Chittoor tirupati Smuggling Red Sandalwood Smuggling Red Sandalwood

సంబంధిత కథనాలు

Online Games Fraud: గల్ఫ్ నుంచి డబ్బు పంపిన మేనత్త, ఆన్ లైన్ గేమ్స్ ఆడి స్వాహా! భయంతో యువకుడి ఆత్మహత్య

Online Games Fraud: గల్ఫ్ నుంచి డబ్బు పంపిన మేనత్త, ఆన్ లైన్ గేమ్స్ ఆడి స్వాహా! భయంతో యువకుడి ఆత్మహత్య

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్‌ ద్వారా లావాదేవీ

NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్‌ ద్వారా లావాదేవీ

Vemulavada Crime News: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలు మృతి - గుండెపోటే కారణం

Vemulavada Crime News: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలు మృతి - గుండెపోటే కారణం

NTR District News: ఆ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తరగతులు చెప్పరు కానీ ఒళ్లంతా తడిమేస్తూ గలీజు పనులు!

NTR District News: ఆ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తరగతులు చెప్పరు కానీ ఒళ్లంతా తడిమేస్తూ గలీజు పనులు!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్

Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?