Crime News: ఈ చెంబు ఉంటే డబ్బే డబ్బు.. యూ ట్యూబ్ చూసి పక్కా స్కెచ్.. కానీ
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు చేసే మోసం చూసి పోలీసులే షాక్ అయ్యారు.
మోసం చేసే వాళ్లు ఉన్నన్ని రోజులు.. మోసపోయే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి దానికి చక్కటి ఉదాహరణే ఈ క్రైమ్. ఓ తెలుగు సినిమాలో బాగా డబ్బున్న వ్యక్తిని హీరో మోసం చేస్తాడు. డబ్బు ఉన్న వ్యక్తికి.. దేవుడిపై చాలా నమ్మకం. దాన్నే అదునుగా తీసుకుని.. రైస్ పుల్లింగ్ కాన్సెప్ట్ తో కోట్ల రూపాయలు మమ అనిపిస్తాడు. అలాంటి ఘటనే తిరుపతిలోనూ జరిగింది. రైస్ పుల్లింగ్ పేరుతో ఓ ముఠా కొన్నాళ్లుగా డబ్బులు దండుకుంటుంది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
రాగిచెంబుకు చాలా శక్తులు ఉన్నాయని.. అది పురతాన కాలం నాటిదని.. అది మీ దగ్గర ఉంటే డబ్బులే డబ్బులని తిరుపతికి చెందిన నలుగురు వ్యక్తులు.. గుంటూరుకు చెందిన ఇద్దరిని నమ్మించారు. అది రైస్ పుల్లింగ్ చేస్తుందని.. చెప్పడంతో గుంటూరు వ్యక్తులు నమ్మేశారు. గతంలోనూ ఇలాంటి వాటి గురించి విన్నామని.. తమకు చూపించాలంటూ.. నచ్చితే తీసుకుంటామని చెప్పారు. తిరుపతికి చెందిన వ్యక్తులు వారిని.. ఇంకా ఎక్కువగా నమ్మేలా చేశారు. రైస్ పుల్లింగ్ చెంబు మీ దగ్గర ఉంటే కోట్ల రూపాయలు మీవే అన్నట్టు చెప్పేసరికి ఆశతో నమ్మారు.
రైస్ పుల్లింగ్ చెంబు విలువ జాతీయ మార్కెట్ లో కోట్ల రూపాయలు విలువ చేస్తుందని నమ్మించారు. గుంటూరుకు చెందిన ఆ ఇద్దరు వ్యక్తులు.. రూ.1,60,000 ఇచ్చి దానిని సొంతం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత.. రాగి చెంబుని అంటగట్టారని బాధితులకు అర్థమైంది. మోసం చేసిన వారిని పదే పదే అడిగారు. కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో.. చేసేదేమీ లేక.. అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎట్టకేలకు నలుగురు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తుండగా తెలిసిన విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు.
యూట్యూబ్ లో చూసి రాగి చెంబుకు సల్ఫర్ ఆక్సైడ్ పౌడర్ రాశారు నిందితులు. పురాతన వస్తువుగా దానికి కలరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన గుంటూరు వ్యక్తులను మోసం చేశారు. నిందితుల నుంచి రూ.1,54,000 నగదుతోపాటు రాగి చెంబు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Amazon Ganja: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ లో గంజాయి... రవాణా గుట్టురట్టు చేసిన పోలీసులు..
Also Read: Hyderabd: 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు.. అంతా హోమో సెక్సువల్స్! రేవ్ పార్టీ భగ్నం
Also Read: Kondapur: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..