Kondapur: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..
ఓ అపార్టుమెంటుకు సంబంధించిన డ్రైనేజీని శుభ్రం చేస్తూ.. ఇద్దరు సఫాయి కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానవీయమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
అత్యాధునిక సౌకర్యాలు, లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ మానవ విసర్జితాలు వెళ్లే డ్రైనేజీలను మరో మనిషి స్వయంగా శుభ్రం చేయడం నిజంగా అత్యంత జుగుప్సాకరమైన పని. కానీ, పొట్ట కూటి కోసం ఈ పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. డ్రైనేజీల్లోకి దిగి ముక్కు పగిలిపోయే దుర్వాసనను భరిస్తూ సఫాయి కార్మికులు పని చేస్తుంటారు. అంత దుర్భర పరిస్థితుల్లో వారి ప్రాణాలకు కూడా ప్రమాదమే. అందులో నుంచి వెలువడే విషవాయువులు ఎంతో ప్రమాదకరం. తాజాగా ఇలాగే డ్రైనేజీలోకి దిగి ఇద్దరు సఫాయి కార్మికులు చనిపోయారు.
ఓ అపార్టుమెంటుకు సంబంధించిన డ్రైనేజీని శుభ్రం చేస్తూ.. ఇద్దరు సఫాయి కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానవీయమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్‌లో ఉన్న గౌతమి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో ఓ డ్రైనేజీ వెళ్లే మార్గాన్ని చేసేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గచ్చిబౌలి మసీదు బండలోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు.. ఇద్దరు కూలీలు ఆదివారం ఉదయం దిగారు. దిగిన కాసేపటికే ఊపిరాడకపోవడంతో ఇద్దరూ అందులోనే మరణించారు. విష వాయువులు పీల్చడంతో అందులోనే కూప్పకూలి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇద్దరు కూలీల మృత దేహాల్ని బయటకు తీశారు. మృతులు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారని పోలీసులు చెప్పారు. వారి సొంత స్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ అని వివరించారు. ఈ మేరకు పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: సీఎం మొద్దు నిద్రలో ఉన్నారా? అప్పుడే చెప్తే ఏం చేశారు.. ఎమ్మెల్యే ఈటల ధ్వజం
Also Read: Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..
Also Read : కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన
Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !