(Source: ECI/ABP News/ABP Majha)
Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..
భయంతో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఒకేసారి బయటకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో పలువురు కింద పడడంతో గాయాలయ్యాయి.
బాలికల హాస్టల్‌లో దెయ్యం ఉందనే ప్రచారం, దాన్ని విద్యార్థులు బాగా నమ్మడం చివరకు తీవ్రమైన రచ్చకు దారి తీసింది. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడలో ఉన్న గిరిజన బాలికల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ హాస్టల్‌లో ఏదో భూతం ఉందని, అది అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నవారిపై పడి ఒంటిపై రక్కుతున్నట్లు, తమను చేయి పట్టుకొని లాగుతున్నట్లు ఉందని అక్కడి బాలికలు నమ్ముతున్నారు. ఈ మూఢ నమ్మకం శుక్రవారం మరింత తీవ్రం అయింది. శుక్రవారం రాత్రి ఓ విద్యార్థిని భయపడిపోయి పెద్దగా కేకలు వేసింది. దీంతో తోటి విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున అరిచారు. హాస్టల్ గదుల్లో ఉన్నవారంతా భయపడి అందరూ మెట్ల మీదుగా కిందికి పరుగులు తీశారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఒకేసారి బయటకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో పలువురు కింద పడడంతో గాయాలు కాగా.. ఆ కేకలు విన్న గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. పలువురు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘట నలో కొంతమందికి గాయాలయ్యాయి. విద్యార్థినుల కేకలు, అరుపులు విన్న గ్రామస్తులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి హుటాహుటిన గిరిజన బాలికల పాఠశాలకు చేరుకున్నారు. బాలికలకు ధైర్యం చెప్పారు. కొంత మందికి గాయాలు కావడం వల్ల వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో 50 మంది విద్యార్థినులు కిందపడి గాయపడ్డారు.
ఆ వెంటనే గ్రామస్తులు హాస్టల్‌లో జరిగిన సంఘటన గురించి విద్యాశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థినులకు, హాస్టల్‌లో ఉ్నవారికి ధైర్యం చెప్పేందుకు గ్రామస్థులు వారి వద్దే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారాక కూడా విద్యార్థినులు తరగతి గదుల్లో మళ్లీ భయపడ్డారు. చివరికి స్థానికంగా ఏఎన్‌ఎంతోపాటు మరో ఇద్దరు హాస్టల్ సిబ్బంది వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు ఏడుపు ఆపలేదు. ఈ విషయం బాలికల తల్లిదండ్రులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని భయపడుతున్న పిల్లలను ఇళ్లకు తీసుకుపోయారు.
ఈ విసయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో అంకిత్ శనివారం రాత్రి గంటలకు పాఠశాలకు, వచ్చారు. స్కూలుతో పాటు హాస్టల్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా తమ స్కూలులో దెయ్యం ఉందని.. తమ పిల్లలు భయపడుతున్నారని, పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని విద్యార్థినుల తల్లిదండ్రులు పీవోను కోరారు. అయితే అలాంటి వేమీలేవని, మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దని పీవో.. బాలికలు, తల్లిదండ్రులకు స్పష్టత ఇచ్చారు.
వార్డెన్‌గా ఉండేందుకు నిరాసక్తి
ఈ గిరిజన హాస్టల్‌లో వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. హాస్టల్‌లో రాత్రి సమయంలో ఏఎన్‌ఎం, నైట్ డ్యూటీ వాచ్‌మన్ డ్యూటీలో ఉన్నారు. అయినా పిల్లలు భయపడ్డారని సిబ్బంది వెల్లడించారు.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !