(Source: ECI/ABP News/ABP Majha)
Eatala Rajender: సీఎం మొద్దు నిద్రలో ఉన్నారా? అప్పుడే చెప్తే ఏం చేశారు.. ఎమ్మెల్యే ఈటల ధ్వజం
రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల సూచించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్.. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
తరచూ తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వడ్లు ఎందుకు కొనలేకపోతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పిందని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా కేసీఆర్ మొద్దు నిద్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసులను వాడుకొని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Also Read: Hyderabad: పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌లో అసహనం బాగా పెరిగిపోయిందని ఈటల అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర సర్కారు ఏడేళ్ల నుంచి రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. అంతేగాక, రైతులు పండించిన ధాన్యంపై పెట్టుబడి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే పెడుతోందని ఈటల చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానేసి ధాన్యం కొనుగోలు చేయాలని హితవు పలికారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ లో ఘన స్వాగతం పలికిన బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. pic.twitter.com/Hq2lulbOQc
— Eatala Rajender (@Eatala_Rajender) November 28, 2021
Also Read: Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ లో స్థానిక నేతలతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. pic.twitter.com/spGpbgyngH
— Eatala Rajender (@Eatala_Rajender) November 28, 2021