Paddy Issue: కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన
వరిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంది. పియూష్ గోయల్‌తో సమావేశమైన మంత్రివర్గం తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగింది.
వరి ధాన్యంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పంచాయితీ ఇంకా తేలలేదు. యాసంగి సీజన్లో పండిన పంట కొంటారా లేదా అని కేంద్రాన్ని నిలదీస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు మంత్రుల బృందం కేంద్రమంత్రి మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశమైంది. ఎన్ని వడ్లు కొంటారో చెప్పాలని స్పష్టత కోరినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
నిరంజన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం... వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. దీనిపై కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారాయన. ఈ సీజన్‌లో ఎంత మొత్తం ధాన్యం సేకరిస్తారో అడిగితే స్పష్టమైన సమాధానం కేంద్రమంత్రి నుంచి రాలేదన్నారు.
కేంద్రం నుంచి ఆశించిన సమాధానం రాలేదని.. ధాన్యం కొంటారో లేదో తెలియదని అందుకే యాసంగిలో వరి సాగు చేయొద్దని నిరంజన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణపై పీయూష్‌గోయల్‌తో చర్చలు విఫలమైనట్టు మంత్రుల బృందం పేర్కొంది. ఏటా ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పాలన్న వినతికి కూడా కేంద్రమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు.
సమావేశ వివరాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపింది తెలంగాణ మంత్రుల బృందం. ధాన్యం సేకరణపై సానుకూల స్పందన వస్తుందని నమ్మకం పోయిందని... రెండునెలల క్రితమే ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ చర్చలు జరిపి, అన్ని అంశాలు కొలిక్కి తీసుకొచ్చారని... కేంద్రమంత్రి ఓకే అంటే కొనుగోలు సజావుగా సాగేదని... ఇప్పుడు కేంద్రం తీరు కారణంగా రైతులకు తీరని నష్టం కలుగుతుందన్నారు నిరంజన్‌రెడ్డి.
కేంద్రం తీరు ఇలా ఉంటే.. తెలంగాణలో బీజేపీ తీరు మాత్రం వేరుగా ఉందని మండిపడింది మంత్రుల బృందం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు చేసింది. ఇకపై అలా మాట్లాడొద్దని... రైతులను తప్పుదారి పట్టించొద్దని సూచించింది. దీనిపై కేంద్రం నుంచి కూడా బీజేపీ నేతలకు సూచనలు వచ్చాయని... వరి ఎక్కువ చేయొద్దని వారించినట్టు నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి