By: ABP Desam | Updated at : 25 Nov 2021 02:03 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పూర్వం మన వంటల్లో పసుపుకు ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో తినే తిండితో పాటూ, వండే విధానం కూడా మారిపోతుంది. మెట్రోనగరాల్లో పసుపు కేవలం రంగు కోసమే వాడుతున్నారు ఎక్కువ మంది. పల్లెటూళ్లలో మాత్రం పసుపును అన్ని కూరల్లోను వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం చాలా మంచిదని, ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు క్లీవ్ ల్యాండ్ క్లినిక్ కు చెందిన ఆరోగ్యనిపుణులు. అమెరికాలో క్లీవ్ ల్యాండ్ క్లినిక్ చాలా ప్రముఖ ఆసుపత్రి. నిత్యం అక్కడ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఆసుపత్రికి చెందిన వైద్యులు, ఆరోగ్యనిపుణులు పసుపు రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. పసుపు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమని తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
1. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది
శరీరంలోని కణజాలాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది పసుపు. దీర్ఘకాలపు రోగాలతో బాధపడుతున్నవారు మందులతో పాటూ రెండు గ్రాముల పసుపు తింటే చాలా మంచిదని చెబుతున్నారు క్లీవ్ ల్యాండ్ క్లినిక్ డైటీషియన్. కడుపులో మంటల్లాంటివి రాకుండా అడ్డుకోవడంలో పసుపు ముందుంటుంది.
2. జ్ఞాపకశక్తి పెరుగుతుంది
క్లినికల్ ట్రయల్స్‌లో 18 నెలల పాటూ రోజుకు 90 మిల్లీగ్రాముల పసుపునే తినేవారిలో చిత్త వైకల్యం తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇవి మెదడులో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. ఆలోచించడానికి అవసరమయ్యే న్యూరోకాగ్నిషన్ వ్యవస్థను కాపాడుతుంది పసుపు.
3. నొప్పి నుంచి ఉపశమనం
ఆర్ధరైటిస్ ఉన్న వారికి చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నొప్పి బాగా పెరుగుతుంది. ఆ సమస్య ఉన్నవాళ్లు ఆహారంలో పసుపు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మందులు వాడుతూనే, ఆహారంలో పసుపును కూడా తింటుంటే నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆయుర్వేదంలో ఆర్ధరైటిస్ చికిత్స కోసం పసుపు కచ్చితంగా వాడతారు.
4. క్యాన్సర్ తో పోరాడుతుంది...
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఒక అధ్యయనం ప్రకారం పసుపులెని ఈ లక్షణాుల ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. అలాగే ఇది శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. యాంటీ క్యాన్సర్ మెకానిజం పసుపులో ఎక్కువ. అందుకే క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ముందునుంచే ఆహారంలో పసుపును మిళితం చేసుకోవాలి.
5. గుండె జబ్బులు రాకుండా...
ఇనఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే పసుపు తద్వారా గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఓ అధ్యయనంలో 12 వారాల పాటూ పసుపు సప్లిమెంట్లను తీసుకున్నవారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో పాటూ, అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంది. అంతేకాదు రోజుకు 4 గ్రాముల కర్కుమిన్ తినేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం 65 శాతం తగ్గింది.
6. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి మందులతో పాటు ఉపయోగించినప్పుడు పసుపు కూడా సహాయపడుతుంది. కర్కుమిన్ సురక్షితమైనదని మరియు కొలెస్ట్రాల్ యొక్క నిర్దిష్ట స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారిని రక్షించవచ్చని పరిశోధన చూపిస్తుంది, అయితే ఎంత మరియు ఏ రకం ప్రభావవంతంగా ఉంటుందో పరిశీలించడానికి మరింత అధ్యయనం అవసరం.
7. డిప్రెషన్ దరి చేరదు
డిప్రెషన్ బారిన పడినవారిలో బ్రెయిణ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ తగ్గిపోతుంది. దీనివల్ల నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి అవసరమయ్యే హిప్పోకాంపస్ తగ్గిపోతుంది. పసుపును తినడం వల్ల ఆ ప్రోటీన్ పెరుగుతుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు చెప్పాయి. పసుపు మంచి హార్మోన్లయిన సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను కూడా పెంచుతుంది. వీటివల్ల డిప్రెషన్ నుంచి త్వరగా తేరుకుంటారు.
సాధారణ వ్యక్తికి రోజుకు 500 మిల్లీగ్రాముల పసుపు శరీరానికి అవసరం పడుతుంది. 1000 మిల్లీగ్రాముల వరకు పసుపు తిన్నా ఫర్వలేదు. పసుపును వంటల్లో కలుపుకుని తింటే సరిపోతుంది. పులిహోర వంటి పసుపుతో చేసిన వంటకాలు తిన్నా మంచిదే.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Read Also: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Read Also: మేనరికపు వివాహాలు మంచివి కావా? పుట్టే పిల్లల్లో నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Skin Protection: ఏసీలో ఎక్కువ సమయం ఉంటున్నారా? అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు
WaterMelons: ఆ దేశంలో డబ్బులకు బదులు పేమెంట్‌గా పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలు, ఎందుకలా?
Optical Illusion: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు
Height: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట
Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్