News
News
X

Moringa Paratha: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు

మునగాకుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కానీ వాటిని తినేందుకు మాత్రం ఎవరూ ఇష్టపడరు. అందుకే ఇలా మునగాకు పరాటా చేసుకుంటే తినాలనిపిస్తుంది.

FOLLOW US: 

మునగాకులో ఉండే పోషకాలు ఇన్ని అన్నీ కావు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు తిన్నా మంచిదే. ఆయుర్వేదం కూడా మునగాకుల్లోని మంచి గుణాల గురించి వర్ణించింది. ఈ ఆకుల్లో మానవశరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. వీటిని ప్రతి రెండు రోజులకోసారి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి. అలాగే గుండె సంబంధ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి మునగాకు తినడం చాలా అవసరం. మునగాకు ఎంత తిన్నా బరువు పెరగరు. కాబట్టి అధికబరువుతో బాధపడేవారు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మునగాకును మెనూలో భాగం చేసుకోవాలి. 

 మునగాకును పొడి చేసుకుని లేదా పప్పుతో కలిపి వండుకుని తింటుంటారు కొంతమంది. కానీ ఎక్కవమంది వాటిని తినడానికి ఇష్టపడరు. అందుకే మునగాకు పరోటా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మునగాకు పరోటా బంగాళాదుంప, పనీర్ కర్రీ, చికెన్, మటన్... ఇలా ఏ కర్రీ జోడీగా చేసుకుని తిన్నా చాలా టేస్టీ ఉంటుంది. మునగాకు పరోటా ఎలా చేయాలో చూద్దాం. 

కావల్సిన పదార్థాలు: గోధుమ పిండి - ఒక కప్పు, మునగాకు - అరకప్పు, ఉల్లిపాయల తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను, ఉప్పు- మీ రుచికి తగినంత, వాము - టీస్పూను, నూనె -పరోటా కాల్చడానికి కావాల్సినంత

ఎలా చేయాలంటే... 
ముందుగా మునగాకును బాగా కడగాలి. దాన్ని నీళ్లలో వేసి ఉడికించాలి. కొంచెం ఉప్పు కూడా కలపాలి. ఉడికాక వడకట్టి ఆకులను ఒక పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండి కలిపినప్పుడు అందులోనే ఉడకబెట్టిన మునగాకులు, వాములు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి, వాము అనీ వేసి బాగా కలపాలి. కలిపిన చపాతీ ముద్దను ఒక పక్కన పెట్టేయాలి. ఇరవై నిమిషాల తరువాత చిన్న ముద్దను తీసి పరోటాలా ఒత్తుకుని పెనంపై నూనె వేసి కాల్చాలి. నూనె ఇష్టం లేకపోతే నేతితో కాల్చుకున్నా బావుంటుంది. పిల్లలకు ఇది మంచి పోషకాహారం. వారంలో కనీసం రెండు సార్లు చేసుకుని తిన్నా ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. 

Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?

Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Nov 2021 12:44 PM (IST) Tags: Moringa paratha Drumstick Paratha Benefits of Moringa leaves మునగాకు పరాటా

సంబంధిత కథనాలు

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?