అన్వేషించండి

Drunken Drive: తిరుమలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12 మంది, వారికి కోర్టు ఎంత జరిమాన విధించిందంటే !

తిరుమల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12 మంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కోర్టు జరిమాన ఎంత విధించిందంటే...??

అఖిలాండ‌ కోటి‌ బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి సన్నిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 మంది పట్టుబడడం కలకలం రేపుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు నిందుతులను కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి తిరుమల కోర్టు భారీ జరిమాన విధించడంతో సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.

కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధికి ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి వివిధ రూపాల్లో స్వామి వారి సన్నిధికి చేరుకుని క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం రోజుల తరబడి పరితపించి పోతుంటారు. తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువైన శ్రీనివాసుడి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రను కాపాడేందులు టిటిడి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు, ప్రసంగాలు, సభలు, ధర్నాలు, మద్యపానం, మాంసాహారంను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తులు ఎవరూ కూడా తిరుమలకు నిషేధిత వస్తువులను తీసుకుని రావద్దని ప్రతి నిత్యం విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంది. కొందరు భక్తుల ముసుగులో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఏదోక సమయంలో తిరుమల పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి.. 

తిరుమలకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేసి నిషేధిత వస్తువులు గుర్తిస్తే వాటిని అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే సీజ్ చేస్తూ ఉంటారు టిటిడి విజిలెన్స్ సిబ్బంది.. కొందరూ అలిపిరి తనిఖీ కేంద్రంలోని టిటిడి విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి కొండపైకి నిషేధిత వస్తువులు, మరియు మద్యం సేవించి కొండపైకి వేళ్తున్న సమయంలో మంగళవారం సాయంత్రం తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వద్ద తిరుమల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 12 మంది భక్తులు టిటిడి నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించి కొండకు ద్విచక్రవాహనాల్లో చేరుకున్నట్లు గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు తిరుమల క్యాంపు కోర్టులో హాజరు పరిచారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12 మందికి ఒక్కొక్కరికి 2000 చొప్పున 22000 జరిమానాను కోర్టు విధించడంతో పాటుగా నిందుతులకు సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. ఇకపై తిరుమలలో తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే భారీ జరిమాణాలు విధిస్తాంమని హెచ్చరికలు జారీ చేశారు.

టిటిడి పాలకమండలి సమావేశం..

టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సభ్యులు బుధవారం సమావేశం కానున్నారు. పాలకమండలి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది టిటిడి. తిరుపతి సమీపంలోని దేవలోక్ లో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం 112 కోట్లు నిధులు కేటాయింపు. ఉల్లందూర్ శ్రీవారి ఆలయ నిర్మాణంకు నాలుగు కోట్లు రూపాయల నిధులు కేటాయించనున్నారు. యానంలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. తిరుమలలో లడ్డూ వితరణ కేంద్రం విస్తరణ, అదనంగా మరో ఐదు కౌంటర్లు నిర్మాణంపై నిర్ణయం తీసుకోనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget