అన్వేషించండి

Crime News : పుప్పాలగూడ జంట హత్యల కేసు - నిందితుల్ని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ - హత్యలకు కారణాలివే!

Crime News : పుప్పాలగూడ గుట్టల వద్ద ఇటీవల జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Crime News : తెలంగాణలోని పుప్పాలగూడ గుట్టల వద్ద ఇటీవల జరిగిన జంట హత్యల కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరణకు అభ్యంతరం తెలిపినందుకు బిందు అనే మహిళను, ఇదే విషయంలో హెచ్చరించినందుకు ఆమె ప్రియుడు అంకిత్ సాకేత్ ను అతని స్నేహితులు పక్కా ప్లాన్ ప్రకారం చంపేసినట్టు పోలీసులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వనస్థలిపురం నివాసి దివ్య బిందు (30), మధ్యప్రదేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడా నివాసి అంకిత్ పుప్పాలగూడ కొండలపై హత్యకు గురయ్యారు. వారిద్దరూ నానక్ రామ్ గూడలో పనిచేస్తున్నారు. దివ్యకు వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంకిత్ తో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న బిందు భర్త... వనస్థలిపురం సమీపంలోని చింతల్ కుంటకు మకాం మార్చాడు. అయినప్పటికీ బిందు ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా.. అంకిత్ సాయంతో అక్కడే వ్యభిచారం మొదలుపెట్టడం మరిన్ని వివాదాలకు దారి తీసింది. 

ఇదే అదనుగా భావించిన అంకిత్ ఫ్రెండ్స్ రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్ లు బిందును తమ వద్దకు తీసుకురావాలని కోరారు. దీంతో బిందు జనవరి 8న భర్తకు తెలియకుండా అంకిత్ తో కలిసి గచ్చిబౌలిలోని అతని రూమ్ లో గడిపింది. ఇక అలా రెండు సార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. ఆమెతో కలిసి ఉన్న సన్నివేశాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె అడ్డు చెప్పింది. వెంటనే విషయాన్ని అంకిత్ దృష్టికి తీసుకెళ్లగా.. తన ఫ్రెండ్ ను గట్టిగా మందలించాడు. దీంతో గొడవ మరింత పెద్దదైంది.

పక్కా ప్లాన్ ప్రకారమే హత్య

తన స్నేహితుడు అలా బెదిరించడంతో కక్ష గట్టిన రాహుల్.. అంకిత్, బిందులపై కక్ష గట్టాడు. తన మరో ఫ్రెండ్స్ రాజ్, సుఖేంద్రల సాయంతో వారిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే జనవరి 11న అంకిత్ ద్వారా బిందును పిలిపించి.. అదే రోజు బిందు, అంకిత్ తో పాటు రాజ్, సుఖేంద్రలను పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు అందరూ మద్యం తాగారు. ఈ సమయంలోనే సుఖేంద్ర, బిందును పక్కకు తీసుకెళ్లాడు. అప్పుడే ఒంటరిగా ఉన్న అంకిత్ ను రాహుల్, రాజ్ లు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత పథకం ప్రకారం బిందును కూడా చంపేశారు. ఆ తర్వాత జనవరి 12న ఏమీ తెలియనట్టు నిందితులు తమ సొంత రాష్ట్రమై మధ్యప్రదేశ్ కు పారిపోయారు.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా పట్టుబడ్డ నిందితులు

పుప్పాలగూడలో బహిర్భూమికి, గాలిపటాలు ఎగురవేసేందుకు వెళ్లిన కొందరు యువకులు వెళ్లగా.. అక్కడ మృతదేహాలు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమందించగా.. వారు మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందుతుల కోసం గాలింపు చేపట్టారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర ఆధారాలతో వారి ఆచూకీ గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక బృందం వెంటనే మధ్యప్రదేశ్ కు చేరుకుని ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

Also Read : Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Group 1 Exams Schedule: అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
Embed widget