అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyber Crime: సైబర్ నేరాలకు సాఫ్ట్ వేర్ అస్త్రంతో చెక్ - మళ్లీ నేరాలకు పాల్పడకుండా పటిష్ట చర్యలు

TGCSB: సైబర్ నేరాలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సరికొత్త సాఫ్ట్ వేర్ అస్త్రంతో చెక్ పెడుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడకుండా చర్యలు చేపడుతున్నారు.

Telangana Cyber Security Bureau New Software: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సరికొత్త సాఫ్ట్ వేర్ అస్త్రంతో సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ నేరం జరిగినా నిందితుడి ఆచూకీ తెలుసుకోవడం సహా.. అతనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో టీజీసీఎస్‌బీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డును సైతం ప్రకటించింది. 'సైకాప్స్' పేరుతో చేసిన ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తుండడంతో ఇదే తరహా టూల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. 

న్యూ సాఫ్ట్ వేర్.. ఒకటే క్లిక్

సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది. నిందితులు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతుండడంతో వారిని కనిపెట్టడం అధికారులకు సవాల్‌గా మారింది. దీన్ని అధిగమించేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది. సైబర్ నేరస్థుడు వాడిన ఫోన్ నెంబరును ఈ సాఫ్ట్ వేర్ ద్వారా నమోదు చేస్తే.. పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ నెంబరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి.?. ఆ సిమ్ ఎవరి పేరుతో ఉంది.?. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది.?. ఈ నెంబరు ద్వారా ఎన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి.?. ఎన్ని బ్యాంకు ఖాతాలు ఆ నెంబరుకు అనుసంధానమై ఉన్నాయి.?. వంటి వివరాలన్నీ పూర్తిగా క్షణాల్లో తెలుస్తాయి. ఒక్కసారి ఈ సమాచారం తెలిస్తే ఆ నేరాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది.

ఇలా చెక్ పెడతారు

  • పట్టుబడ్డ నిందితుడు మళ్లీ నేరాలకు పాల్పడకుండా సాఫ్ట్ వేర్ ద్వారా సేకరించిన వివరాలన్నీ కేసులు నమోదైన ఆయా రాష్ట్రాలతో పంచుకోవడం సాధ్యమవుతుంది. 
  • నిందితుడు ఎక్కడ పట్టుబడ్డా మిగతా రాష్ట్రాలు సైతం పీటీ వారెంట్ మీద తీసుకెళ్లి విచారించి, తమ కేసుల్లోనూ అరెస్ట్ చూపించే వెసులుబాటు ఉంటుంది.
  • దేశవ్యాప్తంగా నమోదైన నేరాల సంఖ్యను న్యాయస్థానంలో చూపి నిందితునికి బెయిల్ రాకుండా చెయ్యొచ్చు. అలాగే, మళ్లీ నేరాలకు పాల్పడకుండా చెక్ పెట్టొచ్చు.
  • సిమ్ కార్డు, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలతో పాటు ఫోన్లు కూడా బ్లాక్ చెయ్యించొచ్చు. ఇలా తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకూ 36,749 సిమ్ కార్డులు, 8,300 ఫోన్లు బ్లాక్ చేయించారు. 
  • 671 మంది సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 77 వేల మోసాలకు పాల్పడినట్లు గుర్తించగలిగారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా అసలు నేరస్థుడిని పోలీసులు సులువుగా గుర్తిస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారు. 
  • అటు, అపరిచిత కాల్స్, లింక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget