Sivakasi Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, పలువురు మృతి- తమిళనాడులోని శివకాశిలో ఘటన
Sivakasi Explosion | శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. మంటలు చెలరేగడంతో చుట్టపక్కల ప్రాంతాన్ని దట్టమైన పొగ కప్పేసింది.

చెన్నై: తమిళనాడులోని శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ఐదుగురు మృతిచెందారు. ఫైర్ క్రాకటర్స్ ఫ్యాక్టరీ నుండి దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాన్ని కమ్మేస్తున్నాయి. లోపల ఉన్న బాణసంచా పేలుతూనే ఉంది. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి కెమికల్స్ కంపెనీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో భవనం కూలిపోయింది. ఈ పేలుడు ఘటనలో 42 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం రాత్రి వరకు 12 మంది మరణించారని భావించినప్పటికీ, మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 42కి పెరిగింది.
శివకాశి దేనికి ఫేమస్...
తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమకు ఫేమస్. ఇక్కడి నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు క్రాకర్స్ సరఫరా అవుతుంటాయి. దేశంలో బాణసంచా, పైరోటెక్నిక్ అవసరాలలో దాదాపు 80 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ఈ పరిశ్రమ 2023లో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. ఈ ఏడాది మే నెలలో శివకాశి బాణసంచా పరిశ్రమ కోసం భౌగోళిక గుర్తింపు ట్యాగ్ (Geographical Indication Tag)ను కోరింది. తమిళనాడు ఫైర్‌వర్క్స్ అండ్ అమోర్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (TANFAMA) తయారైన వస్తువుల విభాగంలో ఈ ట్యాగ్‌ను ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది.
(ఇది అభివృద్ధి చెందుతున్న కథనం మరియు అప్‌డేట్ చేయబడుతోంది.)























