News
News
X

Satyasai Road Accident : శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి మృతి!

Satyasai Road Accident : శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Satyasai Road Accident : శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో , ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

అసలేం జరిగింది?

సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురు మరణించారు.  మరో ముగ్గురికి గాయాలు కాగా చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం... ధర్మవరం వైపు నుంచి బొలెరో వాహనం బత్తలపల్లి వైపు వస్తుంది. బత్తలపల్లిలో ఆటో ప్రయాణికులను ఎక్కించుకొని ధర్మవరం వైపు వెళుతుండగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని నాగుల కట్ట వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా... ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరిని స్థానిక  ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతులు, గాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు.  

పెళ్లింట విషాదం 

 పెళ్లింట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం పెళ్లికూతురు అక్క దుర్మరణం పాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం వాసి  మందుల యేసోబు రెండో కూతురు వసంత పెళ్లి శనివారం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి సామాను కోసం వసంత అక్క గుడిపాటి విజయ, బంధువుతో కలిసి  గురువారం మోత్కూరుకు వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరారు. మోత్కూరు మండలం కొండగడప, పాటిమట్ల మధ్య వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన విజయ అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న యువకుడికి ఎడమకాలు విరిగింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురు మృతితో యేసోబు కుటుంబంలో విషాదం నెలకొంది.  దీంతో శనివారం జరగాల్సిన వసంత పెళ్లి వాయిదా పడింది.  

వికారాబాద్ లో ఘోర ప్రమాదం 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై లారీ తవేరా వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తవేరా డ్రైవర్ అనీఫ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న కొందరు వ్యక్తులు క్షతగాత్రులను కారులోంచి బయటికి తీసి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని మెరుగైన వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి  హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లను యాలాల్ మండలం పగిడ్యాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తవేరా డ్రైవర్ అనీఫ్ చేవెళ్ల మండలం నాగర్ గూడ వాసిగా పోలీసులు తెలిపారు. లారీ, తవేరా  ఢీ కొట్టడంతో ముందు భాగమంతా పూర్తిగా ధ్వంసం అయింది. అందులోనే  తవేరా డ్రైవర్ అనీఫ్ ఇరుక్కుపోయి మృతిచెందాడు.  

Published at : 17 Mar 2023 08:45 PM (IST) Tags: Road Accident Satyasai District six died Auto accident Bolero

సంబంధిత కథనాలు

Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!

Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!

Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!

చిలుక‌ జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది

చిలుక‌ జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్