Sattenapalli News :సత్తెనపల్లిలో విషాదం, డ్రైనేజి క్లీన్ చేసేందుకు దిగి ముగ్గురు మృతి!
Sattenapalli News : సత్తెనపల్లిలోని ఓ రెస్టారెంట్‍లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక చినిపోయారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు కాగా మరొకరు బిల్డింగ్ యజమాని ఉన్నారు.
Sattenapalli News : డ్రైనేజీ సంపు ముగ్గురిని బలి తీసుకున్న విషాద సంఘటన అందరిని కలచి వేసింది. పనులు లేని కారణంగా పొట్టకూటి కోసం అలవాటు లేని పనికి వచ్చి ఇద్ధరు కార్మికులు.. భవన యజమాని కూడా ఈ డైనేజి పనుల కారణంగా బలయ్యారు. దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూ దొరికిన పనికి వెళ్ళి వచ్చిన కూలీ డబ్బులతో కుటుబాన్ని పోషిస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యు వాత పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న వినాయక రెస్టారెంట్ లో డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా ఒక్కసారి ఉలిక్కి పడింది. వినాయక రెస్టారెంట్ భవనం రోడ్డు మట్టానికి తక్కువగా ఉండటంతో మున్సిపల్ డ్రెనేజీ వ్యవస్థకు అను సంధానం కాలేదు. ఈ భవనంలో పైన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ డ్రెనేజీ నీరు, రెస్టారెంట్ మురుగు నీరును భవనానికి దిగువ నున్న సంపులో నిల్వ చేస్తారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మున్సిపల్ డ్రెనేజీకి మళ్ళించి క్లీన్ చేయిస్తారు. గత పది రోజుల నుంచి శుభ్రం చేయించక పోవడంతో ఒవర్ ఫ్లో అయి విపరీతమైన దుర్వాసన వస్తోంది. ఈ క్రమంలో రాత్రి భవన యజమాని కొండలు.. శుబ్రం చేయించేందుకు పని వారి కోసం చూసాడు. వారు అధికంగా అడగటంతో వారిని కాదని గత కొన్ని రోజల నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్న భవన కార్మికులను టార్గెట్ చేశాడు. ఇసుక లేక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్న పరిస్థితి.
పని రాదని చెబుతున్నా.. వెంట తీసుకెళ్లి!
ఈ నేపథ్యంలో రాత్రి భవన కార్మికులు అయిన అనీల్, బ్రహ్మం ఇంటికి వెళ్ళాడు భవన యజమాని... వారికి పని గురించి చెప్పడు. తమకు డ్రైనేజీ పని తెలియదని వారు చెప్పారు. వెళ్ళి పోయిన భవన యజమాని కొండలు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి, నిద్రపోతున్న అనీల్, బ్రహ్మంను లేపి ఆశ పెట్టి తీసుకు వెళ్ళాడని కుటుంబ సబ్యులు చెబుతున్నారు. పది అడుగల లోతు, 18 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీ సంపును శుభ్ర పరిచేందుకు వెళ్లారు. మొదటగా అనీల్ సంపులోకి దిగాడు. బయటకు రాక పోవడంతో బ్రహ్మం కూడా డ్రైనేజీ గోతిలోకి దిగాడు. వీరిద్దరూ శుభ్రం చేసేందకు వెళ్లి గంటలు గడిచిన బయటకు రాకపోవడంతో భవన యజమాని కొండలు విషయం తెలుసుకునేందుకు లోపలికి దిగాడు. కొద్ది సేపటి తర్వాత రెస్టారెంట్ సిబ్బంది అటుగా వచ్చి చూస్తే బట్టలు శుభ్రం చేసే సామానులు కనబడటంతో అనుమానంతో జగ్రత్తగా డ్రైనేజ్ గాలించగా ముగ్గురు గుంటలో పడి పోయినట్లు గమనించారు. పోలీసులకు ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో డ్రైనేజ్ సంపులో ఉన్న ముగ్గురుని బయటకు తీసారు. అప్పటికే ముగ్గురు మృతి చెందారు.
ఊబిగా మారి చనిపోయారేమో..!
అయితే డ్రైనేజ్ అడుగున స్లాబ్ చేయించక పోవడంతో ఊబిగా మారి క్లీన్ చేస్తున్న సమయంలో అందులో చిక్కుకొని చనిపోయారని కొందరు చెబుతున్నారు. మరి కొందకు డ్రైనేజ్ ఓపెన్ చేయగానే గ్యాస్ రిలీజ్ అయి వీరి ప్రాణాలు పోయాయని అంటున్నారు. మూడు మృత దేహాలను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందటంతో ఆ కార్మికుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం మృతి చెందిన కార్మిక కుటుబాలను ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు.