అన్వేషించండి

Cyber Fraud Recovery: సైబర్ ఫ్రాడ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారికి రీఫండ్ - రూ.5489 కోట్ల రికవరీ - కేంద్రం కీలక నిర్ణయం

Cyber fraud Refunds: సైబర్ ఫ్రాడ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారికి త్వరలో రీఫండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్రమంత్రి బండి సంజయ్ సమీక్షలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

Refunds soon for those who lost money in cyber fraud:  సైబర్ మోసగాళ్ల నుండి రూ.5489 కోట్లను కేంద్ర దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.  ఢిల్లీలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS) కార్యకలాపాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షలో అధికారుల వెల్లడించారు.  ఆ సొమ్మును త్వరగా బాధితులకు అందేలా రూల్స్ ను సులభతరం చేయాలని బండి సంజయ్ అధికారులను ఆదేశించారు.  

సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సమీక్షించారు. 

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రాధాన్యతను వివరించారు. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సైబర్ మోసాల నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి సంబంధిత శాఖ అధికారులు వివరించారు.  సైబర్ మోసాల బాధితుల నుండి  ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు 12 లక్షలకుపైగా సిమ్‌లు/మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అట్లాగే రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డోవడం జరిగిందని, అందులో భాగంగా  13.3 లక్షల మ్యూల్ అకౌంట్లను (సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలు) ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) లో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), 1930 – సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CFCFRMS), సైబర్ మల్టీ ఏజన్సీ సెంటర్ (CyMAC), రిపోర్ట్ & చెక్ సస్పెక్ట్ సౌకర్యం, సస్పెక్ట్ రిజిస్ట్రీ, సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోల ద్వారా విస్త్రత సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అట్లాగే కేంద్ర రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సామర్ధ్యాల అభివ్రుద్ధికి సైతం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అట్లాగే సోషల్ మీడియా, పత్రికలు, ప్రసార్ భారతి, ఆకాశవాణి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు విస్త్రత అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అందులో భాగంగా  1930 పేరుతో  సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ హెల్ప్‌లైన్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సైబర్ మోసాల బాధితులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బు రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయాలని, లా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు (LEAs) ఆధునిక పరికరాలు, శిక్షణతో దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్‌లైన్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి గుర్తింపు, రిపోర్టింగ్, బాధితుల సహాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.అత్యవసర కేసుల కోసం సైబర్ కమాండోలు సరైన రీతిలో నియమించాలి.సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు, హెల్ప్‌లైన్ 1930 , cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడానికి ఉత్సాహపరిచే విధంగా స్థానిక భాషల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget