Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
అప్సర మర్డర్ మిస్టరీలో అసలేం జరిగిందో పోలీసులు బయట పెట్టారు. ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Apsara Murder Case Update : హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర అనే యువతి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పూజారి అయినప్పటికీ అత్యంత క్రిమినల్ మైండ్‌తో వ్యవహరించాడు. హత్య చేసి ఇంటికి సమీపంలోనే మ్యాన్ హోల్ పడేసి.. ఎవరికీ తెలియకుండా.. తెలియనట్లుగా వారం రోజుల పాటు వ్యవహరించాడు.చివరికి బయటపడిన తర్వాత కూడా పూజారి వ్యవహారశైలి తేడాగా ఉండటం పోలీసుల్నిసైతం ఆశ్చర్య పరిచింది.
హత్య చేయడానికి పక్కా ప్లాన్
అప్సర పెళ్లి చేసుకోవాలని పదే పదే సాయిపై అప్సర ఒత్తిడి తెస్తుండటంతో ఆమెను హత్య చేయాలని పూజారి పక్కా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్సరను హత్య చేసేందుకే ట్రాప్ చేసి జూన్ 3న హైదరాబాద్ బయటికి తీసుకెళ్లాడు. కోయంబత్తూరు వెళ్తున్నట్లు అప్సర ఇంట్లో తల్లికి చెప్పి బయటికి వచ్చింది. సాయికృష్ణ, అప్సర ఇద్దరూ ఫోర్డ్ కారులో సరూర్‌నగర్ నుంచి బయలుదేరివెళ్లారు. తన కారులో బెల్లం కొట్టే కర్ర తెచ్చుకున్నాడు సాయి. శంషాబాద్ చేరుకున్న తర్వాత రాళ్ళగూడ వైపు కార్లు తీసుకువెళ్లాడు సాయి. రాళ్లగూడలో భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత కారు ముందు సీటులోఅప్సర కూర్చుంది. కారులో కూర్చోని అప్సర విశ్రాంతి తీసుకుంటోంది. ఇదే అదనుగా చేసుకున్న సాయికృష్ణ అప్సరను ఇంటి దగ్గర నుంచి బెల్లం దంచే దుడ్డు కర్రతో తలపై బాది హత్య చేశాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఇద్దరి మధ్య వివాహేతర బంధం
సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర ఒకే వీధిలో ఉంటారు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై ఓపాప కూడా ఉంది. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే ఒకసారి ఆమె గర్భం దాల్చడంతో సాయికృష్ణ అబార్షన్ చేయించాడు.. తాజాగా అప్సర మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని గత రెండు నెలలుగా సాయి పై తీవ్ర వత్తిడి తీసుకువస్తున్నది. దీంతో ఆమె భారీ నుంచి తప్పించుకునేందుకు హత్య చేయాలని నిర్ణయించుకుని పక్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని పోలసులు చెబుతున్నారు.
హత్య చేసిన తర్వాత ఒక రోజు కారులోనే మృతదేహం
అప్సరను హత్య చేసిన తర్వాత అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపించాడు. అప్సర కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.
పెళ్లి చేసుకోమని వేధించినందుకే చంపేశా : పూజారి సాయికృష్ణ
పెళ్లి చేసుకోమని అప్సర ధించింది. అప్సర గర్భం కూడా దాల్చింది. అందుకు నేనే కారణమని ఒత్తిడి చేసింది. కానీ అప్సర వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఈ వేధింపుల నేపథ్యంలో నేను హత్య చేశాను. గత కొన్నాళ్ళ నుంచి అప్సరతో నాకు వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి చేసుకోవాలని నన్ను అప్సర చిత్రహింసలు పెట్టింది. వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే నేను అప్సరను హత్య చేశాను’ అని పోలీసు విచారణలో ఒప్పకునట్లుగా తెలుస్తోంది.