Tirupati Finance Company Theft : లేడీ మేనేజరే అసలు ఖిలాడీ - కాళహస్తీ ఫైనాన్స్ కంపెనీ దోపిడీ కేసులో అసలు ట్వీస్ట్ ఇదే
కాళహస్తి ఫిన్‌కేర్ కంపెనీలో దోపిడీకి ప్లాన్ చేసింది.. అమలు చేసింది మేనేజర్ స్రవంతినేనని పోలీసులు తేల్చారు.
Tirupati Finance Company Theft : సులభంగా డబ్బులు సంపాదించేందకు కొందరు అడ్డ దారులను ఎంచుకుని పోలీసులకు అడ్డంగా దొరికి జివితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఆర్ధికంగా స్ధిర పడాలన్న అత్యాశ ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగిని పాలిట శాపంగా మారింది.. గత నెల శ్రీకాళహస్తి ఫీన్కేర్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దోపిడి కేసులో ఏడు రోజుల తరువాత పోలీసులు పురోగతి సాధించారు.. దొపిడికి కారకులైన ఏడు మంది ముద్దాయిలను పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. ఈ స్కెచ్ మొత్తం వేసింది ఫిన్‌కేర్ బ్యాంక్ మేనేజర్ స్రవంతి. సినీ ఫిక్కిలో దోపిడి చేయించింది.. తాను పని చేసే ఫైనాన్స్ కంపెనీలో నగదు దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేసింది. కానీ పోలీసులకు దొరికిపోయింది.
స్కెచ్ వేసి మరీ దోపిడీ చేయించిన లేడీ మేనేజర్ !
గత నెల 26 అర్ధరాత్రి తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్కేర్ ఫైనాన్స్ కంపెనీ కంపెనీలోని దోపిడి కేసు రాష్ట్రం వ్యాప్తంగా సంచళనం సృష్టించింది.. సినీ తరహాలో అర్ధారాత్రి ముసుగులు ధరించి ఫైనాన్స్ కంపెనీలో చోరబడి ఎనభై లక్షల విలువ గల బంగారు నగలు, నగదును దోచుకెళ్ళారు.. ఈ దోపిడి కేసుపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి. దీంతో కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫైనాన్స్ కంపెనీలోని మేనేజర్ కీలక నిందుతురాలిగా గుర్తించారు.. ప్రధాన నిందితురాలు స్రవంతితో పాటుగా మరో ఏడు మంది నవీన్,సుల్తాన్ మహమ్మద్, విజయ్ కుమార్, జేమహ్మద్ హుస్సేన్, జగదీష్,ఆంటోని రాజ్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. వీరి వద్ద నుండి కోటి రూపాయలు విలువ చేసే 1274 గ్రాముల బంగారు ఆభరణాలు,840 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు, ఇతర కంపెనీలో కుదరవ పెట్టిన ఒక కేజీ బంగారు ఆబరణాలతో పాటుగా, మూడు లక్షల యనభై వెల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
దోపిడీకి స్రవంతి వేసిన స్కెచ్ మామూలుగా లేదు !
తూర్పుగోదావరి జిల్లాకు చేందిన ఏ.స్రవంతి గత ఐదు సంవత్సరాలుగా ఫిన్కేర్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజరగా పని చేస్తుంది.. ఫైనాన్స్ కంపెనీకి వచ్చిన కస్టమర్ బంగారాన్ని స్వయంగా పరిక్షించి బంగారు లోన్‌ను మంజూరు చేసేది.. గత మూడు సంవత్సరాలుగా అప్రైజర్ కూడా తానే కావడంతో తనుకు డబ్బులు అవసరం కావాల్సిన సమయంలో స్నేహితులు పేరు మీదుగా నకిలి ఆభరణాలు పెట్టి డబ్బులు తీసుకునేది. నిజమైన కస్టమర్ పేరుతో వాటిని బయటకు తీసి వాటిని ముత్తూట్, మినీ, ఐఐఏఫ్ఎల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో వాటిని తాకట్టు పెట్టి నగదు పొందేది. ఎవరైనా కస్టమర్లు డబ్బులు కట్టిననగలు వెనక్కు తీసుకున్న తరువాత ఆ లోన్ క్లోజ్ చేయకుండా వారి నగలు ఇచ్చిన స్ధానంలో నకిలి బంగారు ఆభరణాలు ఉంచి డబ్బులు చేసుకునేది. ఆడిటింగ్ జరిగే సమయంలో ఎలగోలా మానేజ్ చేస్తూ, తనకు డబ్బులు అవసరం అయ్యినప్పుడల్లా పెద్ద మొత్తంలో నకిలి బంగారు ఆభరణాలు పెట్టి ఫైనాన్స్ కంపెనీలను బురిడి కొట్టించేది.. అయితే ఫైనాన్స్ కంపెనీలో సగానికి సగం నకిలీ బంగారు ఆభరణాలు కావడంతో, వివిధ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన ఆభరణాలు తిరిగి తీసుకొచ్చేందుకు ఇబ్బంది పడిన స్రవంతి.. స్నేహితులతో కలిసి సినీ ఫక్కీ తరహాలో ఫైనాన్స్ కంపెనీ దోపిడికి ప్లాన్ వేసింది..
ఫిన్కేర్ ఫైనాన్స్ కంపెనీ దోపిడికి స్రవంతి ఎవరికి ఆశ్రయచిందంటే...?
శ్రీకాళహస్తికి చేందిన తన స్నేహితుడు విజయ్, తన స్నేహితురాలి భర్త నవీన్, అంబులెన్స్ డ్రైవర్ సుల్తాన్ ద్వారా ఫైనాన్స్ కంపెనీ దోపిడిపై చర్చించింది.. శ్రీకాళహస్తిలో తన స్నేహితుల ద్వారా కొందరి ద్వారా దొపిడి చేసేందుకు ప్రయత్నం చేసింది.. కానీ వారు పని చక్కబెట్టలేక పోవడంతో నేరుగా సీన్ లోకి స్రవంతే అడుగు పెట్టింది.. సుల్తాన్, నవీన్ ద్వారా చెన్నైకు చేందిన హుస్సేన్ ద్వారా గురురాజ్, ఆంటోనీ రాజ్, అరుణ్ లను బ్యాంక్ దోపిడి చేసేలా స్కేచ్ వేసి, బ్యాంక్ లో ఉన్న తనపై కత్తి పెట్టి బంగారు ఆబరణాలు, నగదు దోచుకెళ్ళా చేసింది. కానీ పక్కాగా చేయలేకపోయారు. దొరికిపోయింది.