Tirupati Crime News : ఆ దొంగలు " కంప్యూటర్" స్పెషలిస్టులు - కానీ చేసేది సైబర్ దొంగతనాలు కాదు
కంప్యూటర్‌తో సైబర్ మోసాలు చేయడం కష్టమనుకుని నేరుగా కంప్యూటర్లనే ఎత్తుకెళ్తోంది ఓ దొంగముఠా. పదేళ్ల పాటు దొంగతనాలకు పాల్పడిన తర్వాత పోలీసులకు చిక్కింది.
సైబర్ మోసాలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. ఇంట్లో నుంచి కదలకుండా సైబర్ దాడుల ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. కానీ నేరగా కంప్యూటర్లనే కొట్టేయాలనే ఆలోచన మాత్రం దొంగలు చేయరు. వాటిని కొట్టేస్తే వాటి విలువ ఎంత ఉందో నిపుణులకు మాత్రమే అర్థమవుతుంది..పైగా టెక్నికల్ గా ఎక్కడైనా దొరికిపోయే ప్రమాదం ఉంటుంది... అందుకే కంప్యూటర్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడతారు కానీ కంప్యూటర్లే ఎత్తుకుపోరు. కానీ దొంగలందరూ ఒక్కటి కాదు కాబట్టి... కొంత మంది భిన్నమైన దొంగలుంటారు. వారు కంప్యూటర్లను మాత్రమే చోరీ చేస్తారు. ఇలాంటి ముఠా తిరుపతిలో దొరికిపోయింది.
కొండపై దుకాణం తెరిచిన కేటుగాళ్లు- పోలీసులకు సమాచారం చేరడంతో గుట్టురట్టు
చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రధాన కళాశాలలను టార్గెట్ గా చేసుకుని ... ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్లు , ఉపకరణాలను అపహరించి అధికం మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో విక్రయించి డబ్బు కూడ బెట్టే ముఠా చాలా కాలంగా పోలీసులకు సవాల్‌గా మారింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రధాన ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలను దొంగల ముఠా టార్గెట్‌గా పెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో కంప్యూటర్ ఉపకరణాలైన ర్యామ్, ప్రాసెసర్లకు మంచి గిరాకీ ఉంది కాబట్టి.. దొంగల ముఠా కంప్యూటర్ ఉపకరణాలు దొంగతనాలు చేయడం ఓ అలవాటు మలచుకున్నారని ఎస్పీ ప్రకటించారు.
హైదరాబాద్ శివారులో నగ్నంగా అమ్మాయి, అబ్బాయి మృతదేహాలు ! ఎవరు వాళ్లు ? హత్యలా , ఆత్మహత్యలా ?
2010 నుంచి జిల్లాలోని 50 కళాశాలలలో దొంగల ముఠా కంప్యూటర్ ఉపకరణాల దొంగతనాలకు పాల్పడినట్లు ప్రాథమిక వెల్లడైందని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. దొంగలించిన ర్యామ్, ప్రాసెసర్, మానిటర్, సీపీయూలను చెన్నైలోని బర్మా మార్కెట్ కేంద్రంగా అమ్మకాలు సాగించారన్నారు.. ఇప్పటి దాకా 20 లక్షలపైగా కంప్యూటర్ ఉపకరణాలు దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు.. ఈ క్రమంలో పక్క సమాచారంతో ఇవాళ పూతలపట్టు మండలం, రంగంపేట క్రాస్ వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.. అలాగే వారి వద్ద నుంచి లక్షల రుపాయలు నగదు, ర్యామ్, ప్రాసెసర్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనియప్పన్ మురళీ, పుంగావనం శేఖర్, కడప జిల్లాకు చెందిన పసలవెంకటరెడ్డి, కందులవెంకట్, పుల్లెరి గోపిలు ప్రధాన నిందితులుగా ఉన్నారని వీరిపై గతంలో పలు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయ్యాయి. వీరు ఇతర దొంగతనాలేమీ చేయలేదని.. కంప్యూటర్ల దొంగతనం మాత్రమే స్పెషలైజేషన్‌గా పెట్టుకున్నారని వారి నేరాల చిట్టా బయటపడటంతో తేలింది.