By: Harish | Updated at : 20 Dec 2022 06:16 PM (IST)
రెండేళ్ల క్రితం చనిపోయిన బ్యాంక్ ఉద్యోగిని మృత దేహనికి రీ పోస్ట్ మార్టం
Krishna Crime News : చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత వివాహిత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. తమ కుమార్తె మరణం పై అనుమానాలు ఉన్నాయంటూ వివాహిత కుటుంబ సభ్యులు న్యాయస్దానం లో కేసు దాఖలు చేయటంతో విచారించిన ధర్మాసనం రీ పోస్ట్ మార్టం కు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు తాజాగా పోస్టు మార్టం పూర్తి చేశారు.
అనుమానాస్పద స్థితిలో సఫీయ బేగం మృతి - పోస్ట్ మార్టం లేకుండానే అంత్యక్రియలు
కృష్ణాజిల్లా గన్నవరం కి చెందిన సఫీయ బేగం కు 32 సంవత్సరాలు. గుంటూరు లో ఇండియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా పని చేస్తున్న ఆమె.. రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు. అప్పుడే తమ కుమార్తె ని కొట్టి చంపేశారని, అత్తమామల పై బేగం తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు .అయితే ఈ వ్యవహరంలో పోలీసులు అంతగా పట్టించుకోలేదు.పైగా మతపరమయిన అంశాలు ముడిపడి ఉండటంతో అప్పుడు ఆమె మృత దేహన్ని పోస్ట్ మార్టం చేయకుండానే ఖననం చేశారు. దీంతో తల్లిదండ్రులు న్యాయస్దానాన్ని ఆశ్రయించారు. న్యాయస్దానంలో విచారణ జరిగి ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు,రెవిన్యూ అదికారులు,వైద్య సిబ్బంది పర్యవేక్షలో ప్రత్యేకంగా పోస్ట్ మార్టం నిర్వహించి,నమూనాలను సేకరించారు. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
కుటుంబంలో గొడవలు - అనుమానాస్పదంగా చనిపోయిన సఫియా బేగం
సఫీయ బేగంకు ఇద్దరు పిల్లలు సంతానం. బ్యాంక్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. అయితే అనుమానం పెంచుకున్న భర్త తరచూ గొడవపడేవారు. ఈ విషయంలో పెద్దలతో అనేక సార్లు మాట్లాడించారు.పెద్దలు జోక్యం చేసుకున్నప్పుడల్లా బేగంను మంచిగా చూసుకుంటామని హామి ఇచ్చే వారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే,బ్యాంకు ఉద్యోగంలో గౌరవంగా బతుకున్నప్పుడు అనవసరంగా పరువు పోతుందని భావించిన బేగం అనేక సార్లు కుటుంబ సభ్యులకు కూడా వేదింపుల విషయాన్ని చెప్పలేదు. భర్తకు మరో వివాహం చేసేందుకు ప్రయత్నించటంతో బేగం గత్యంతరం లేని పరిస్దితుల్లో విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించింది. దీంతో బేగం కుటుంబ సభ్యులు ,అత్తమామల పై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మత పెద్దలు జోక్యం చేసుకొని వారించారు.ఈ తంతు జరుగుతుండగానే బేగం అనుమానాస్పద స్దితిలో చనిపోయింది.
ఆలస్యంగా వెలుగులోకి లేఖ !
అంత్యక్రియలు పూర్తయిన తరవాత బేగం కు సంబందించిన లేఖ వెలుగులోకి వచ్చింది. బేగం బతికున్న సందర్బంగా వ్రాసుకున్న లేఖలో తన వేదన మెత్తాన్ని వివరించింది. దీంతో బేగం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎలాగూ బేగం చనిపోయింది కాబట్టి,వి వాదం ఎందుకని మత పెద్దలతో నచ్చచెప్పించారు. తమకు జరిగిన అన్యాయం పై కుటుంబ సభ్యులు తీవ్ర వేదినకు గురయ్యి,చివరకు న్యాయస్దానాన్ని ఆశ్రయించారు.రెండు సంవత్సరాల తరవాత న్యాయస్దానం నుండి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతొ బేగం మృత దేహం కు రీపోస్ట్ మార్టం అదికారులు పోస్ట్ మార్టం నిర్వహించారు. మత ఆచారాలను అడ్డంగా పెట్టుకొని తమ కుమార్తెను చంపేసి, బలవంతంగా అంత్యక్రియలు చేశారని నఫియ బందువులు అంటున్నారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది.
Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే
Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం