Palnadu News: కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తా - 40 మందికి తీవ్ర గాయాలు, పల్నాడు జిల్లాలో ఘటన
Andhra News: పల్నాడు జిల్లాలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోటప్పకొండకు మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Bus Overturned in Palnadu News: పల్నాడు (Palnadu) జిల్లా కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన దాదాపు 60 మంది మొక్కు తీర్చుకునేందుకు కోటప్పుకుండకు ఓ స్కూలు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు కట్టర్ విరిగి తిమ్మాయపాలెంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే స్పందించిన స్థానికులు వారిని ప్రైవేట్ వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: AP Ceo: ఏపీ ఎన్నికలు - సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు, హోర్డింగులు తొలగించేందుకు డెడ్ లైన్