By: ABP Desam | Updated at : 12 Jul 2022 10:24 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
లోన్ యాప్ ల వేధింపులు
Loan Apps Cheating : నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ క్రెడిట్ యాప్ ల మోసాలు పెరిగిపోయాయి. లోన్ యాప్ ల వేధింపులు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. రుణాలు ఇస్తూ అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు గత నెల 12వ తేదీన స్మాల్ క్రెడిట్ అప్ ద్వారా 4,500 రూపాయల రుణం తీసుకున్నాడు. ఏడు రోజుల్లో తీసుకున్న రుణం చెల్లించాడు. మళ్లీ డబ్బులు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధించడంతో అదనంగా మరో రూ.4 వేలు చెల్లించాడు. లోన్ యాప్ వాళ్లు అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని లేకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని ఫోన్లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. కాంటాక్ట్ లిస్టులోని కొందరికి మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వేధింపులు తాళలేక ఏడపల్లీ పోలీస్ స్టేషన్లో యువకుడు ఫిర్యాదు చేశాడు.
మరో యువకుడు బలి
ప్రాణం పోతేనేం మాకేంటి మా డబ్బులు మాకు కావాలి అంతే అన్నట్లు ఉంది ఆన్ లైన్ రుణ యాప్ ల తీరు. వారి వేధింపులకు అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల సింగరేణిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఓ యువకుడిని బలితీసుకున్నారు లోన్ యాప్ ల నిర్వాహకులు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ సభ్యులను బూతులు, అశ్లీల ఫొటోలతో వేధించారు. అవమానం భరించలేక యువకుడు రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. అయితే అతని కుటుంబానికి ఇంకా వేధింపులు కొనసాగుతుండటం మరింత బాధాకరం.
అసలేం జరిగింది?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన దాతు రాజన్న మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు వీరిలో పెద్ద కోడుకు ప్రశాంత్ 2017 నుంచి సింగరేణి ఓవర్ మేన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల అండర్ మేనేజర్ అధికారిగా పరీక్ష కూడా పాస్ అయ్యారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో కొంత డబ్బు పోగొట్టుకున్న ప్రశాంత్ అవసరాల కోసం మనీవ్యూ నుంచి రూ.60 వేలు రుణం తీసుకున్నారు. ప్రశాంత్ సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలు పెట్టారు. అతనికి ఫోన్ చేసి బూతులు తిట్టడం మొదలు పెట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రశాంత్ వేరే మహిళతో నగ్నంగా ఉన్నట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి అతని తల్లికి వాట్సాప్ చేశారు. అంతటితో ఆగకుండా తండ్రి ఫోన్ లో డీపీగా ఉన్నా తల్లిదండ్రుల ఫొటోలపై అసభ్య పదజాలంతో బంధువులకుషేర్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. యాప్ నిర్వాహకులు ప్రశాంత్ తల్లికి ఫోన్ చేసి హిందీలో బూతులు తిడుతూ డబ్బు కోసం బెదిరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మరోపక్క ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో తల్లిదండ్రులు అదే రోజు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. 9వ తేదీ సాయంత్రం రామగుండం రాఘవాపూర్ రైల్వే స్టేషన్ మధ్య కేరళ ఎక్స్ ప్రెస్ వస్తుండగా రైలు పట్టాలపై పడుకున్న ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ప్రశాంత్ పోస్టుమార్టం జరుగుతుండగా యాప్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు కోసం వేధింపులు మొదలుపెట్టారు. ప్రశాంత్ మరణించి మూడు రోజులు కావస్తున్నా ఆ వేధింపులు మాత్రం ఆగడంలేదనీ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు.
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్లైన్లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>