Osmania University Tension : ఓయూలో ఉద్రిక్తత, వీసీ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన విద్యార్థులు!
Osmania University Tension : హైదరాబాద్ ఓయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్స్ కేటాయించడంలో వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Osmania University Tension : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఓయూ పరిపాలనా భవనంలోకి విద్యార్థులు చొచ్చుకు వచ్చారు. దీంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీకి విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు.
విద్యార్థికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ఓయూలో ఉద్రికత్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ హాస్టల్స్ కేటాయింపులో వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో ఓయూ వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు పీజీ విద్యార్థులు ప్రయత్నించారు. వీసీ ఛాంబర్ అద్దాలు, సామాగ్రి ధ్వంసం అయ్యాయి. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ఓయూలో హాస్టల్స్ వెంటనే కేటాయించాలని విద్యార్థుల ఆందోళన చేపట్టారు. వీసీ వెంటనే స్పందించి హాస్టల్స్ కేటాయించాలని ఓయూ పరిపాలనా భవనంలోకి విద్యార్థులు చొచ్చుకువచ్చారు. దీంతో పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ2 హాస్టల్ విద్యార్థులు మెస్ హాస్టల్ కోసం అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా విద్యార్థులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పీడీఎస్ యూ సెక్రటరీ ప్రవీణ్ అనే విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
నిజాం కాలేజీ విద్యార్థుల పోరాటం
హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీ విద్యార్థినుల పోరాటం ఫలించింది. వారికి హాస్టల్ వసతి కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా నిర్మించిన హాస్టల్‌ను పూర్తిగా అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిజాం ప్రిన్సిపాల్ సర్క్యూలర్ విడుదలచేశారు. హాస్టల్ వసతి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పిస్తామని ఏమైనా మిగిలితే పీజీ వారికి ఇస్తామన్నారు. హాస్టల్ ఫెసిలిటీ కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. నిజాం కాలేజీలో ఇటీవల కొత్త హాస్టల్ భవనాన్ని నిరమించారు దీన్ని మొత్తం పీజీ విద్యార్థులకే ఇవ్వాలని మొదట నిర్మయించారు. అయితే యూజీ విద్యార్థులు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో సమస్యను పరిష్కరించాలని వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి అధికారులకు దిశానిర్దేశం. అయితే అధికారుల ప్రతిపాదనలు విద్యార్థినులకు నచ్చలేదు. దాంతో వారు ఆందోళన కొనసాగించారు. హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్న ఒక్క డిమాండ్‌కే వారు కట్టుబడ్డారు. అధికారులు ఎంత ఒత్తిడి చేసినా.. ఆందోళన చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు.
యూజీ విద్యార్థుల ఆందోళన
కేటీఆర్ చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శలు చేయడంతో విద్యార్థినులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా మాట్లాడారు. హాస్టల్ వసతి విషయంలో ఓయూ వీసీ, నిజాం ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించడంతో సమస్య పరిష్కారం అయినట్లయింది. హాస్టల్ వసతి కోసం దాదాపు 15 రోజులుగా వారు కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసనలు తెలిపారు. నిజాం కాలేజీలో కొత్త హాస్టల్ నిర్మాణానికి కేటీఆరే నిధులు మంజూరు చేశారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ విద్యార్థినుల హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. చివరికి ఆ సమస్య అలా పరిష్కారం అయింది. హాస్టల్ కోసం పోరాడిన విద్యార్థినులు సమస్య పరిష్కారంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.