Golden Temple: గోల్డెన్ టెంపుల్‌కి సమీపంలో మరోసారి పేలుడు, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు
Golden Temple: గోల్డెన్ టెంపుల్‌కి సమీపంలో మరోసారి పేలుడు కలకలం రేపింది.
Golden Temple:
రెండోసారి..
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి సమీపంలో మరోసారి పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఇక్కడ ఓ సారి పేలుడు సంభవించింది. గ్యాస్ లీక్ అయ్యుంటుందని పోలీసులు భావించారు. అయితే...మళ్లీ ఇక్కడే బ్లాస్ట్ జరగడం టెన్షన్ పెంచుతోంది. చుట్టు పక్కల బిల్డింగ్‌ల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ఎందుకు జరిగిందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. గోల్డెన్ టెంపుల్‌కి కిలోమీటర్ దూరంలోనే పేలుడు సంభవించినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయని,విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియాలో మాత్రం ఈ పేలుళ్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది ఫేక్ న్యూస్‌నీ షేర్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు సూచనలు చేశారు.
"పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. బాంబ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా వచ్చి పరిశీలిస్తోంది. ఈ విచారణ అంతా పూర్తైన తరవాతే ఈ పేలుడుకి కారణమేంటో చెప్పగలం. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కాలుకి స్వల్ప గాయమైంది. "
- పోలీసులు
Punjab | We are verifying. The situation is normal here. Anti-sabotage, Bomb Squad, and FSL teams are here. One person has received a minor injury in the leg: Mehtab Singh, ADCP, Amritsar on reports of a blast near Golden Temple in Amritsar pic.twitter.com/KOljUw0r6T
— ANI (@ANI) May 8, 2023
Punjab | Bomb Squad and FSL team at the spot after a suspected bomb explosion was reported near Golden Temple in Amritsar https://t.co/EBubbzqAFU pic.twitter.com/yx0dROANqw
— ANI (@ANI) May 8, 2023
మే 6వ తేదీన పేలుడు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో బాంబు పేలుడు కలకలం రేపింది. హెరిటేజ్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. శనివారం (మే 6వ తేదీ) అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. పార్కింగ్ ప్లేస్‌కు కొంత దూరంలో భారీ శబ్దం వినిపించింది. ఈ పేలుడుతో పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు. ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేపడుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ అమృత్‌సర్ ట్విటర్ అకౌంట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోస్ట్ చేశారు. అమృత్‌సర్‌లో పేలుడు జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఈ పేలుడులో కొందరు స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు.
"అమృత్‌సర్‌లో పేలుడు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. విచారణ కూడా కొనసాగుతోంది. అనవసరంగా ప్యానిక్ అవ్వద్దు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. అందరూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తరవాతే ఏ సమాచారాన్నైనా షేర్ చేయండి"
- అమృత్‌సర్ పోలీస్ కమిషనర్
Also Read: Army Helicopter Crash: ఇంటిపై కూలిన ఆర్మీ హెలికాప్టర్, ఇద్దరు మృతి - పైలట్‌లు మాత్రం సేఫ్