Army Helicopter Crash: ఇంటిపై కూలిన ఆర్మీ హెలికాప్టర్, ఇద్దరు మృతి - పైలట్‌లు మాత్రం సేఫ్
Army Helicopter Crash: రాజస్థాన్‌లో ఓ ఇంటిపై ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు మృతి చెందారు.
Army Helicopter Crash:
రాజస్థాన్‌లో ప్రమాదం..
ఆర్మీ హెలికాప్టర్లు, చాపర్‌లు కూలిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌మార్గ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్‌గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే...ఆ చాపర్ ఓ ఇంటిపై కూలడం వల్ల ఆ ఇంట్లోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలోనూ సుఖోయ్, మిరేగ్ విమానాలు కుప్ప కూలిన ఘటనల్లో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌లోనే భరత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. మధ్యప్రదేశ్‌లోనూ మొరెనా ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఏప్రిల్‌లో కొచ్చిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.
IAF MiG-21 crashes in Rajasthan; Rescue op underway
— ANI Digital (@ani_digital) May 8, 2023
Read @ANI Story | https://t.co/SCRItSpjA4#MigCrash #Mig21 #Rajasthan pic.twitter.com/OT0LZTyFjv
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
— ANI (@ANI) May 8, 2023
జమ్ముకశ్మీర్ లో
జమ్ముకశ్మీర్ లోని కిశ్త్ వాఝ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ ఇటీవలే కుప్పకూలింది. ఈ ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మరణించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన పబ్బాల అనిల్ అనే ఆర్మీ జవాన్ జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పని చేస్తుండగా.. జమ్ము కశ్మీర్ వద్ద సిగ్నల్ సమస్యల వలన అనిల్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న "ఆర్మీ ఏఎల్ హెచ్ ధ్రువ్" హెలికాప్టర్ నదిలో పడిపోయింది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు.. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఆ ప్రమాదంలో అనిల్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్మీ జవాన్ అనిల్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు అయాన్, ఆరవ్, తల్లి తండ్రులు మల్లయ్య, లక్ష్మి, ఇద్దరు సోదరులు శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు. ధ్రువ్ హెలికాప్టర్లు కూలిపోతుండటం వల్ల కొన్ని రోజుల పాటు వాటిని వాడకూడదని నిర్ణయించుకుంది ఆర్మీ. మరి కొన్ని హెలికాప్టర్లు కూడా ఇలానే సాంకేతిక సమస్యలతో ప్రమాదాలు కొని తెస్తున్నాయి.
Also Read: Kerala Houseboat Tragedy: కేరళ బోటు మునక దుర్ఘటనలో 21కు చేరిన మృతుల సంఖ్య, రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ