News
News
X

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో దారుణం, ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

Nizamabad News : ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యువతి గొంతుకోసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది.

FOLLOW US: 

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించడంలేదని ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు దగ్గరి బంధువు. ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన ఘటన శనివారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా మొపాల్ మండలం భాడ్సి చిన్నాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. చిన్నపూర్ కు చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ బండారుకు చెందిన సుంకరి సంజయ్ కుమార్ దూరపు బంధువు. సంజయ్ తనను ప్రేమించాలని యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వచ్చిన సంజయ్ ఆమెతో గొడవపడి గొంతు కోశాడు. యువతి రోడ్డుపై అరుపులు, కేకలు వేయడంతో సంజయ్ పారిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు. యువతికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. 

కత్తులు, పారతలో దాడి 

 శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని అంతరకుడ్డ గ్రామంలో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తొలుత టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు గొర్రెల శాలలో ఉండగా.. కత్తులు, పారలతో వచ్చిన వైసీపీ వర్గీయులు దాడి చేశారు. విషయం గ్రహించిన తెదేపా కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. ఘటన జరుగతున్న ప్రాంతమంతా రక్తమోడుతున్న పట్టించుకోకుండా ప్రణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

రణరంగంగా మారిన గొర్రెల శాల..

పోలీసు లు, గ్రామస్థుల వివరాల మేరకు.. అంతరకుడ్డ గ్రామంలో టీడీపీకి చెందిన వంకల కృష్ణమూర్తి, ఆయన కుమారులు వంకల లక్ష్మణ రావు, వంకల గోపి తమకు చెందిన గొర్రెల శాలలో జీవాలను కట్టేస్తుండగా వైసీపీకి చెందిన దుబ్బ శ్రావణ్, దుబ్బ ధర్మారావు, దుబ్బ శరత్, పీత అప్పయ్య, పీత లక్ష్మణ రావు కత్తులు, పారలు తీసుకుని వచ్చి దాడులు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో టీడీపీకి చెందిన లక్ష్మణరావు ఎడమ చేయి విరిగిపోయింది. గోపి, కృష్ణమూర్తికు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీకి చెందిన దుబ్బకు, పీత అప్పయ్య, దుబ్బ శ్రావణ్, దుబ్బ శరత్ తల, చేతిపై గాయాలయ్యాయి. విపరీతమైన శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలంతా వారి గొడవను ఆపారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ వారందరినీ వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీకి చెందిన లక్ష్మణరావు, గోపి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించారు. పాతకక్షలతో తమ కుటుంబాన్ని అంతమొందించేందుకే వైసీపీ వర్గీయులు కత్తులు, పారలతో దాడి చేశారని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. కాగా వీరిరువురి మధ్య నాలుగు నెలల క్రితం గొర్రెల మంద వ్యవహారంలో ఘర్షణ జరిగింది. 

తమ గొర్రెల మందలో కలసిపోతు న్నాయంటూ ఇరు వర్గాలు తగాదా పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తరచుగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్హీయులు పథకం ప్రకారం దాడి చేశారు. తెదేపా వర్గీయులు కూడా ప్రతిదాడి చేయడంతో అందరూ గాయపడ్డారు. ఏఢుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి మరీ ఆందోళన కరంగా ఉంది.

Published at : 16 Jul 2022 03:09 PM (IST) Tags: TS News Crime News Knife Attack Nizambad news lover attack

సంబంధిత కథనాలు

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు ! ఇంటిని తవ్వించేసుకున్నాడు !

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు !  ఇంటిని తవ్వించేసుకున్నాడు !

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు