US Shooting: అమెరికాలో దారుణం, భారత సంతతికి చెందిన వ్యక్తిపై నడిరోడ్డుపై కాల్పులు - చికిత్స పొందుతూ మృతి
Crime News: అమెరికాలో రోడ్‌పై జరిగిన గొడవలో ఓ ట్రక్ డ్రైవర్ భారత సంతతికి చెందిన వ్యక్తిని కాల్చి చంపాడు. బాధితుడికి రెండు వారాల క్రితమే వివాహం జరిగింది.
Gun Shot Deaths in US: అమెరికాలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడుతూ తుపాకులతో కాల్చి చంపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో భారత సంతతికి చెందిన వాళ్లూ ఈ కాల్పులకు ఎక్కువ బలి అవుతున్నారు. ఇండియానా రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వీళ్లిద్దరికీ ఈ మధ్యే పెళ్లైంది. యాక్సిడెంట్ విషయంలో జరిగిన గొడవ ఇలా హత్యకు దారి తీసింది. గావిన్ డసౌర్ తన భార్యతో కలిసి కార్‌లో ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ ట్రక్ డ్రైవర్‌తో గొడవ జరిగింది. దారికి అడ్డం వచ్చాడన్న కోపంతో కార్ దిగి ట్రక్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు డసౌర్. చేతిలో గన్ కూడా ఉంది. డ్రైవర్‌ని గట్టిగా బెదిరించాడు. ఈ లోగా ట్రక్ డ్రైవర్ తన గన్‌తో డసౌర్‌ని కాల్చాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే బాధితుడు కుప్ప కూలిపోయాడు. వెనకాల కార్‌లో ఉన్న వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
USA 🇺🇸 - An Indianapolis road rage incident has claimed the life of 29-year-old Gavin Dasaur. He approached another car and can be heard screaming "You want to play with me?" as he banged his gun against the door of the pickup truck of the man he was arguing with. Dasaur was… pic.twitter.com/GzT8z7ZKbX
— The Many Faces of Death (@ManyFaces_Death) July 18, 2024
డసౌర్‌కి మెక్సికోకి చెందిన మహిళతో జూన్ 29న వివాహమైంది. రెండువారాలకే ఇలా మృతి చెందాడు. ట్రక్ డ్రైవర్‌తో గొడవ పడిన సమయంలో గట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ట్రక్‌ని గట్టిగా కొట్టాడు. ఆ సమయంలోనే డ్రైవర్ తన గన్‌తో కాల్పులు జరిపాడు. దాడి జరిగిన వెంటనే డసౌర్‌ని లోకల్ హాస్పిటల్‌కి తరలించారు. ట్రీట్‌మెంట్ జరుగుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆత్మరక్షణలో భాగంగానే తాను కాల్పులు జరిపినట్టు డ్రైవర్ పోలీసులకు వెల్లడించాడు.