Nellore: తండ్రి ప్రవర్తనలో మార్పు! సవతి తల్లిని చాకుతో పొడిచి చంపేసిన యువకులు
Nellore News: వరసకి తల్లి అనే కనికరం కూడా లేకుండా ఆమెను కత్తితో నరికి చంపారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Nellore Crime: వారిద్దరి వయసు టీనేజీ వయసు. పెద్దగా ప్రపంచం తెలియని వయసు. భావోద్వేగాలకు, చెప్పుడు మాటలకు సులభంగా మారిపోయే మనసు. తండ్రి ప్రేమ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో వారు ఇద్దరూ సవతి తల్లిని కిరాతకంగా హతమార్చారు. వరసకి తల్లి అనే కనికరం కూడా లేకుండా ఆమెను కత్తితో నరికి చంపారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నిందితులు ఇద్దరినీ నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి తమ తల్లితో ఉండకుండా సవతి తల్లి వద్దే ఎక్కువ సమయం ఉంటున్నాడనే కోపంతో వారిద్దరూ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరులోని హరిజనవాడకు చెందిన గోళ్ల చిన్నమ్మ, దాసరి శివయ్యకు 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి వారు ఇద్దరూ విడిపోయారు. 12 ఏళ్ల క్రితం ఇందుకూరు పేట మండలానికి చెందిన మాధురిని వివాహం చేసుకున్నాడు శివయ్య. మాధురి, శివయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు సర్వేపల్లిలో కాపురం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శివయ్య తన మొదటి భార్య దగ్గరకు రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కొడుకులతో ఆ విషయంలో గొడవలు అవుతున్నా శివయ్య మాత్రం మొదటి భార్య దగ్గరకు వెళ్లి వస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో తండ్రి తమకు దూరమవుతున్నాడని వారు ఇద్దరూ భావించారు. నాన్న కోపంతో కుమారులు వంశీ, నితీష్ ఇద్దరూ తమ తండ్రి మొదటి భార్య చిన్నమ్మను దారుణంగా నరికి హత్య చేశారు. నిందితులు ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.