News
News
వీడియోలు ఆటలు
X

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యలయంలో మీడియా సమావేశం నిర్వహించి 8 మంది మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ గాష్ అలాం తెలిపారు.

FOLLOW US: 
Share:

- మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్ 
- పరారులో ఆరుగురు కొరియర్ లు 
- మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దామోదర్ కు సహకరిస్తున్నట్లు ఎస్పి వెల్లడి 
- విప్లవ సాహిత్యం స్వాధీనం, బ్లాస్టింగ్ వైర్లు, సెల్ ఫోన్లు , నగదు స్వాధీనం 

Mulugu District: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యలయంలో మీడియా సమావేశం నిర్వహించి 8 మంది మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ గాష్ అలాం తెలిపారు. జిల్లాలోని వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ సమీపంలో సోమవారం పోలీసుల వాహన తనిఖీలలో 8 మంది మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలకు కొరియర్ గా పనిచేస్తున్న ఏడుగురు పురుషులు, ఒక మహిళా మావోయిస్టు కొరియర్ లను  వెకటాపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలలో అందె రవి, శ్రీరామోజు మనోజు,  దిడ్డి సత్యం, శ్రీరామోజు భిక్షపతి, అనసూరి రాంబాబు, ఘనపురం చంద్రమౌళి, ఘనపురం పృథ్వీ రాజ్, అందె మానసలు ఉన్నారు.

అరెస్టయిన వీరు భూ తగాదా విషయంలో మావోయిస్టు ఆగ్ర నేత దామోదర్ వద్దకు వెళ్లగా ఎనిమిది మందిని మావోయిస్టు కొరియర్ గా దామోదర్ మార్చుకున్నారని అన్నారు. మావోయిస్టులకు కావలసిన వస్తువులను తీసుకెళ్తున్న క్రమంలో వీరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. మొత్తం 14 మంది కాగా అందులో 8 గురిని అరెస్ట్ చేశామని మిగతా ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.  వీరి వద్ద బ్లాస్టింగ్ కు వినియోగించే సామాగ్రి, బ్లాస్టింగ్ వైర్లు, సెల్ ఫోన్లు  నగదు, విప్లవ సాహిత్యంతో పాటు మెడికల్  కీట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా కొంత కాలం కిందట ఇతర నిందితులతో కలిసి నిషేధిత సీపీఐ పార్టీ సభ్యులను కలిశామని చెప్పారు. మావోయిస్టు గ్రూపు ప్రధాన నాయకుడు దామోధర్, కొంతమంది దళ సభ్యులు తమ భూ సమస్యలను పరిష్కరించడం కోసం నిషేధిత సీపీఐ మావోయిస్టు గ్రూపు విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారని, ఈ క్రమంలోనే వీరు కొరియర్లుగా మారినట్లు ఎస్పీ తెలిపారు. గ్రామాలలో ఏవైనా భూతగాదాలుంటే పోలీసులను ఆశ్రయించాలని మావోయిస్టుల చెరకు వెళ్లకూడదని ఎస్పీ అన్నారు

స్వాధీనం చేసుకున్న వస్తువులు :
1) IEDs-45 యొక్క ఇనుప భాగాలు,
2) కార్డెక్స్ వైర్-10 మీటర్లు,
3) డిటోనేటర్లు-02,
4) బ్యాటరీ-01.
5) విప్లవ సాహిత్యం-04.
6) సిపిఐ (మావోయిస్ట్) పార్టీ యొక్క అనారోగ్య UG క్యాడర్‌లకు ఉద్దేశించిన మధుమేహం మరియు ఇతర అనారోగ్యాలకు మందులు
7) కారు బేరింగ్ నెం: TS11 EY 0306 (వైట్ కలర్ కియా సెల్టోస్)-01.
8) హోండా మోటార్ బైక్ బేరింగ్ నెం: TS25A1007 (నలుపు రంగు)-01.
9) మొబైల్ ఫోన్లు-08
10) నగదు రూ: 4140/-

Published at : 20 Mar 2023 10:53 PM (IST) Tags: Crime News Mulugu Maoist party Mulugu District Damodar

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు  - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?