By: Ram Manohar | Updated at : 13 Jul 2022 02:32 PM (IST)
స్థానిక భాష మాట్లాడుతున్నాడని మెక్సికోలోని ఓ బాలుడికి తోటి విద్యార్థులు నిప్పంటించారు.
ఆల్కహాల్ పోసి నిప్పంటించి..
స్థానిక భాష మాట్లాడాడన్న కారణంగా ఓ 14 ఏళ్ల బాలుడిపై ఆల్కహాల్ పోసి నిప్పంటించిన ఘటన మెక్సికోలో జరిగింది. వర్ణ వివక్ష ఎక్కువగా
ఉన్న ఈ ప్రాంతంలో, ఇలాంటి దాడులు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే స్కూల్‌లో ఇలాంటిది చోటు చేసుకోవటం వల్ల స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానిక భాష మాట్లాడుతున్నాడన్న కోపంతో ఇద్దరు బాలురు, అడ్డగించి మరీ దాడి చేశారు. ఆల్కహాల్ పోసి
నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడు, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడికి ముందే ఎన్నోసార్లు ఈ బాలుడు, వేధింపులకు గురయ్యాడు. ఈ ఘటన తరవాత బాధితుడు కుటుంబ సభ్యులు, దాడికి కారణమైన వారిపైనే కాకుండా స్కూల్ యాజమాన్యంపైనా
కేస్ పెట్టారు. ఒటోమీ మూలాలున్న వ్యక్తి కావటం వల్లే ఇలా వివక్షకు గురి అవుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాటిన్ అమెరికన్ కంట్రీలోని స్థానిక తెగల్లో ఒకటి ఒటోమీ. ఇక్కడ దాదాపు 3 లక్షల 50 వేల మంది ఒటోమీ జాతికి చెందిన వారున్నారు.
విచారణకు ఆదేశాలు..
తన మాతృభాష ఒటోమీ అయినప్పటికీ, అందరూ వెక్కిరిస్తున్నారన్న కారణంతో మాట్లాడకుండానే ఉండిపోయాడు బాధితుడు. స్కూల్‌లోని టీచర్స్‌తో పాటు మీడియా కూడా తన కొడుకుని వేధించిందని బాధితుడి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి
విచారణ జరపాలని ప్రాసిక్యూటర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా నిందితులకు శిక్ష విధించాలని స్పష్టం చేశారు. మెక్సికోలో
వర్ణ వివక్ష తీవ్రతరమవుతోంది. 12.6 కోట్ల మంది జనాభా ఉన్న మెక్సికోలో దాదాపు రెండున్నర కోట్ల మంది స్థానిక తెగకు చెందిన వాళ్లేఉన్నారు. దాదాపు 70 లక్షల మంది స్థానిక భాషనే మాట్లాడుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
నిత్యం ఇదే వివక్ష..
మార్చ్‌లోనూ ఇదే విధంగా ఓ ఒటోమీ మహిళ "టాయిలెట్" యూజ్ చేసినందుకు, రెస్టారెంట్ ఓనర్ తీవ్రంగా నిరసించాడు. దాదాపు 40% మంది స్థానిక తెగలకు ఇలా వేధింపులకు గురవుతున్నారు. వారి హక్కులకూ గౌరవం దక్కటం లేదు. స్థానిక తెగకు చెందిన వారికి విద్యాపరంగానే కాకుండా, ఉద్యోగాల విషయంలోనూ వివక్ష ఎదురవుతోందని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. రంగుని బట్టి మనిషి తెలివితేటలునిర్ణయించి, అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని తేల్చి చెప్పింది. ఈ వర్ణ వివక్షను కట్టడి చేసేందుకు మెక్సికోలో చట్టాలు చేసినా, వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. నిత్యం అక్కడ ఇలాంటి దాడులతో స్థానిక తెగలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
Also Read: Taapsee Pannu: నా సినిమా బడ్జెట్ మొత్తం ఒక హీరో రెమ్యునరేషన్ తో సమానం- తాప్సీ
Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!
Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !
Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు
ప్రియురాలు పిలిచింది- వాట్సాప్ స్టాటస్ చూసి ప్రియుడి పెళ్లి ఆపేసింది
ప్రాణాలు తీసిన ఎస్సై ప్రిలిమ్స్- యువతి, యువకుడు మృతి
Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్లోగా రండి: CJI
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?