Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోరైలు ముందు దూకిన వ్యక్తి, క్షణాల్లో తునకలుగా - షాకింగ్ వీడియో
మూసాపేట్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైలుకి ఎదురుగా దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం షాక్ కి గురి చేసింది. గడిచిన నెల రోజుల్లో మెట్రో స్టేషన్లలో జరిగిన మూడో ఘటన ఇది.
ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా సరే, మెట్రో స్టేషన్లు ఆత్మహత్యకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా మెట్రో స్టేషన్ లలో ఆత్మహత్య ఘటనలు వెలుగు చూశాయి. మళ్లీ ఈ రోజు మూసాపేట్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైలుకి ఎదురుగా దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం షాక్ కి గురి చేసింది. గడిచిన నెల రోజుల్లో మెట్రో స్టేషన్లలో జరిగిన మూడో ఘటన ఇది. మూడు రోజుల క్రితం ఆర్థిక సమస్యలు తాళలేక ఒక వృద్ధ మహిళ మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. కోన ఊపిరిలో ఉన్న ఆమెని ఆసుపత్రికి కి తరలించేలోపే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. 20 రోజుల క్రితం నాగోల్ లో కూడా ఇంట్లో పరిస్తుతుల వల్ల ఇబ్బంది పడ్డ ఓ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా హైదరాబాద్ మూసాపేట మెట్రో స్టేషన్‌లో జరిగిన ఘటనలో గురువారం (డిసెంబరు 6) రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టికెట్ తీసుకోకుండా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి ట్రాక్‌పైకి చేరుకుని రైలు రాగానే దూకాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ వీడియోని బట్టి చూస్తే అతని శరీరం ముక్కలు ముక్కలు అయినట్లుగా కనిపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Horrible Video: Man suicides after jumping before #HyderabadMetro Train before it stops at #Moosapet Metro station#Hyderabad pic.twitter.com/5F80aeXG9J
— Venkatesh Kandepu (@venkateshkande3) January 6, 2023