అన్వేషించండి

Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి

Andhra Pradesh Crime News | ఏపీలో దారుణం జరిగింది. కన్న తండ్రే కనుపాపల్ని కాటేశాడు. ఇద్దరు బాలికలపై వారి తండ్రి లైంగిక దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

Annamayya Crime News | నిమ్మనపల్లి: అన్నమయ్య జిల్లా చెందిన నిమ్మనపల్లె మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన ఇద్దరు కూతుళ్లపై ఆ కామాంధుడు  అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమకు ఏం జరిగింది, నాన్న తమను ఏం చేస్తున్నాడో కూడా తెలియని పసివయసు వారిది. భర్త చేసిన దారుణం తెలియగానే కట్టుకున్న భార్యే ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. 

అసలేం జరిగిందంటే..

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లి శివాజీ నగర్ లో బోయకొండ (28),  చిట్టెమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు సంతానం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కొడుకు పెద్దవాడు కాగా, మిగిలిన వారు నలుగురు ఆడపిల్లలు. చెట్లు కోసేందుకు, కూలి పనులకు బోయకొండ వెళుతుండేవాడు. అతడి భార్య చిట్టెమ్మ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ గాజులు విక్రయించేది. ఇలా వీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో బోయకొండ మద్యానికి అలవాటు పడ్డాడు. తాను కూలి పనిచేసి వచ్చిన డబ్బును మద్యం సేవించడానికి ఖర్చు చేసేవాడు.

మరోవైపు కుటుంబాన్ని పోషించేందుకు భార్య గాజులు అమ్మేందుకు బయటకు వెళ్లింది. మద్యం మధ్యలో మత్తులో ఉన్న బోయకొండ కన్ను తన కుమార్తెలపై పడింది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట పెద్ద కుమార్తె (9) పై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు రెండవ కుమార్తె (7) పై సైతం దారుణానికి పాల్పడ్డాడు. తరువాతి రోజు ఏడేళ్ల కూతుర్ని మరోసారి బయటకు తీసుకెళ్తుండగా, బోయకొండ అత్త గమనించింది. అతడి తీరు చూస్తే అనుమానం వచ్చి, పాపను ఎక్కడ తీసుకెళ్తున్నావని మందలించడంతో వదిలేసి వెళ్లాడు. 

కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి..

చిన్నారులు తమకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని మేనమామకు,  అమ్మమ్మకు చెప్పారు. ఏం జరిగిందని ఆరా తీస్తే చిన్నారులు చెప్పిన విషయం విని వారు షాకయ్యారు. నాన్న తమను తీసుకెళ్లి ఏదో చేశాడని.. అప్పటినుంచి కడుపునొప్పి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చిన్నారుల తల్లి చిట్టికి తెలిపారు. బిడ్డల పరిస్థితిని చూసి చలించిపోయిన కన్నతల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలపై బలవంతంగా కోరిక తీర్చుకున్న కామాంధుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి పోలీసులు ఆ బాలికలపై లైంగిక దాడి నిర్ధారణ కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: Mukesh Chandrakar: గుండెను చీల్చి బయటకు తీశారు - కాలేయం 4 ముక్కలైపోయింది, జర్నలిస్ట్ ముఖేశ్ హత్య కేసులో సంచలన విషయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Kho-Kho World Cup: అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
Donald Trump : భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
Embed widget