అన్వేషించండి
Mahabubnagar Road Accident: జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టిన డీసీఎం, ఆరుగురు మృతి

Mahabubnagar Road Accident: జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టిన డీసీఎం, ఆరుగురు మృతి
Road Accident in Mahabubnagar: హైదరాబాద్: మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆటో, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం.. మొదట ఆగి ఉన్న ఆటోను, ఆ వెంటనే ఓ బైక్ ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















