Tirumala News: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - అసలు ట్విస్ట్ ఏంటంటే?
Crime News: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. కాగా, మహిళకు ఇది వరకే పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
![Tirumala News: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - అసలు ట్విస్ట్ ఏంటంటే? lovers suicide attempt in srivarimettu route in tirumala Tirumala News: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - అసలు ట్విస్ట్ ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/23/902a16e4ffe2428543d0ba1351ac07f01724415751052876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lovers Suicide Attempt In Srivari Mettu Route: తిరుమల (Tirumala) శ్రీవారి మెట్టు మార్గంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 450 మెట్టు వద్ద ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ యువకుడితో ప్రేమలో పడి మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారి మెట్టు నడక మార్గం దగ్గరకు శుక్రవారం చేరుకుని.. ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిని గమనించిన భక్తులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరోవైపు, మహిళ తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. ఆమె భర్త కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రేమ జంటను బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీష్, రాధికలుగా పోలీసులు గుర్తించారు. వీరిని కిందకు దించిన భద్రతా సిబ్బంది అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)