అన్వేషించండి

Kurnool News: మూడు సార్లు విచారణ కోసం పిలిచిన ఎన్ఐఏ - మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Kurnool News: ఎన్ఐఏ అధికారులు మూడు సార్లు విచారణకు పిలవగా.. మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

Kurnool News: కర్నూలు జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. ఎన్ఐఏ అధికారులు మూడు సార్లు విచారణకు పిలిచారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన భార్య వెల్లడించింది. కర్నూలు జిల్లా కేంద్రంలోని గడ్డవీధిలో నివాసం ఉండే 42 ఏళ్ల షేక్ అబ్దుల్లా మంగళవారం రోజు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈయనకు గతంలో నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధం ఉండేది. ఈక్రమంలోనే అబ్దుల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచింది. జులై 10వ తేదీ, 16వ తేదీలలో విచారణ కోసం పిలవగా.. అబ్దుల్లా వెళ్లారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విచారణ నిమిత్తం అబ్దుల్లాకు ఎన్‌ఐఏ నుంచి మరోసారి కాల్ వచ్చింది. అతనికి ఫోన్ వచ్చిన తర్వాత చాలా బాధ పడ్డారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన భార్య చెప్పింది. ఈక్రమంలోనే తాను అతడిని ఓదార్చానని చెప్పింది. రాత్రి సమయం కావడంతో పడుకుంటానని వెళ్లిన అబ్దుల్లా.. తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని చనిపోయాడు. అబ్దుల్లా భార్య ఫిర్యాదు మేరకు కర్నూలు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఒకే చెట్టుకు ఉరి వేసుకొని ప్రేమికుల ఆత్మహత్య

తిరుపతి జిల్లాలో ఇలాంటి విషాద ఘటన వెలుగు చూసింది.  తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోనున్న అటవీ ప్రాంతంలో ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణిగా గుర్తించారు. ఎర్రవారిపాలెం ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్ (17), రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణి (15) పుంగనూరులోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారింది. యుగంధర్, కల్యాణి వీరు కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మైనర్లు కావడంతో తల్లిదండ్రులు వీరిని బుద్ధిగా చదువుకోవాలని నచ్చజెప్పారు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిగురించి ఆలోచించవచ్చని హితవు పలికారు. 

తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని యుగంధర్, కల్యాణి ఈ నెల 18 తేదీ రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరుపతి- పీలేరు రహదారిలో భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య (Lovers Suicide In Tirupati District) చేసుకున్నారు. ఆదివారం పశువుల మేతకు వెళ్లిన పశువుల కాపరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెట్టు నుంచి కిందకు దించి పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి, యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు మైనర్లు కావడం విశేషం. బాలిక మెడలో పసుపు కొమ్ము తాడు కనిపించింది. ఆత్మహత్యకు ముందు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని, కానీ తల్లిదండ్రులు వీరి దూరం చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget