Krishna News: సినిమా సీన్లలా బైకుతో వెరైటీ ఫీట్లు, ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Krishna News: సరదాగా బైకుపై స్టంట్లు చేయాలనుకున్నాడు. కానీ అదే అతడి చావుకు కారణం అయింది. నిండు నూరేళ్ల తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అతడు.. బైక్ పై విన్యాసాలతో ప్రాణాలు కోల్పోయాడు.
Krishna News: సినిమాలో మాదిరిగా బైక్ పై విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడు. తల రోడ్డుకు బలంగా గుద్దుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడాడు. ఈరోజు కన్నుమూశాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణకు 18 ఏళ్లు. అయితే ఇతను ఎనిమిదో తరగతి వరకు చదివి, ఉపాధి కోసం స్థానికంగా ఓ బైక్ మెకానిక్ వద్ద పనిలో చేరాడు. స్నేహితులతో కలిసి తరచుగా బైక్ పై విన్యాసాలు చేస్తుండే వాడు. అయితే చాలా సార్లు పోలీసులు విన్యాసాలు ఆపేయాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ గౌరీ సాయికృష్ణ వినలేదు. ఇదే విషయమై తల్లిదండ్రులు కూడా గట్టిగా మందలించారు. అసలే పేద కుటుంబం.. ఆపై చేతికి అందివచ్చిన కొడుకు చేసే ఈ ప్రమాదాకర విన్యాసాల గురించి వారెప్పుడూ భయపడుతూనే ఉండేవారు. ఈ క్రమంలోనే ఈనెల 6వ తేదీన సాయంత్రం... విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో పమిడిముక్కల మండలం మంటాడ సర్వీస్ రోడ్డులో బైక్ పై స్టంట్లు చేస్తుండగా... అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ క్రమంలోనే తల బలంగా రోడ్డుకు గుద్దుకుంది. దీంతో మెదడుకు దెబ్బ తగిలింది.
విషయం గుర్తించిన స్నేహితులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆనంతరం విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు.. అతడి గాయాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలో, చెయ్యో విరిగినా తమతోనే ఉంటాడని భావించి రోజుల పాటు చికిత్స ఇప్పించారు. కానీ 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన గౌరీ సాయికృష్ణ సోమవారం రోజు కన్నుమూశాడు. ఇతడి మృతితో ఉయ్యూరు పట్టణంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. బైక్ పై ఈ ఫీట్లు వద్దని చెప్పినా వినకుండా.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని తండ్రి చిన్ని నటరాజశేఖర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. వన సమారాధన వద్ద తల్లిని దించి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు శవంగా మారడం చూసిన తల్లి తల్లడిల్లిపోతోంది. బైకులపై విన్యాసాలు, స్టంట్లు వద్దని వందల సార్లు చెప్పినా వినకుండా తల్లిదండ్రులకు తీవ్ర శోఖాన్ని మిగల్చవద్దంటూ సాయికృష్ణ తల్లిదండ్రులు వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో అంతిమ యాత్రలో పాల్గొన్న యువకులు కన్నీరు పెట్టుకున్నారు.
అనంతపురం జిల్లాలో బైక్ రైస్ లు..
కొన్ని నెలల క్రితం అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బైక్ రేస్ లతో కర్ణాటక యువకులు హల్ చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజులుగా పెనుకొండలో బాబయ్య ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే రాత్రి పెనుకొండ సమీపంలో జాతీయ రహదారి NH44మీద అర్ధరాత్రి కర్ణాటకకు చెందిన కొందరు యువకులు బైక్ రైస్ లు నిర్వహించారు