News
News
వీడియోలు ఆటలు
X

Khammam: బాత్రూంకి వెళ్లి బయటికి రాని కొత్త పెళ్లికొడుకు, తలుపు పగలగొట్టగా షాకింగ్ సీన్ - పెళ్లైన రెండోరోజే ఘోరం

Khammam: బాత్రూం తలుపు వేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి చూసేసరికి నరేశ్ రక్తపు మడుగులో ఉన్నాడు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకొని చనిపోయి ఉన్నట్లుగా గుర్తించారు.

FOLLOW US: 
Share:

Khammam Newly Married Man Suicide:  అది పెళ్లి వారి ఇల్లు. వైభవంగా వివాహం జరిగి రెండు రోజులే అయింది. ఇంతలో పెను విషాదం.. రెండు రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరమైన ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు.

వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేశ్ అనే 29 ఏళ్ల వ్యక్తికి, ఏపీలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన అమ్మాయితో మే 4న పెళ్లి జరిగింది. 5వ తేదీన అమ్మాయి స్వగ్రామంలో రిసెప్షన్ కూడా పెట్టారు. ఈ వేడుకల్లో పెళ్లి కొడుకు చాలా ఉత్సాహంగా కనిపించాడు. స్నేహితులు, బంధువులతో కలిసి డాన్సులు చేశాడు. పెళ్లి, రిసెప్షన్ హడావుడి ముగిశాక విజయవాడ గుణదలకు దైవ దర్శనానికి ఫ్యామిలీ మొత్తం వెళ్లాలని అనుకున్నారు. అందుకోసం తెల్లవారుజామునే బయలుదేరాలని, అద్దె కారు కూడా మాట్లాడుకున్నారు. దీంతో పొద్దున్నే లేచి స్నానాలు కూడా చేశారు. 

కానీ, నవ వరుడు నరేశ్ మాత్రం కనిపించలేదు. మరో బాత్రూం తలుపు వేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి చూసేసరికి నరేశ్ రక్తపు మడుగులో ఉన్నాడు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకొని చనిపోయి ఉన్నట్లుగా గుర్తించారు. పెళ్లి కుమారుడు అలా ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో ఎవరికీ అంతుపట్టలేదు.

నరేశ్ తండ్రి నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి నాగమ్మ ఆశా వర్కర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. చిన్న కొడుకు అయిన నరేశ్‌ (29) 2014లో బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం గ్రూప్‌ –1, ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సిద్ధమవుతూనే ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. పెళ్లికి ముందు, తర్వాత బంధువులు, స్నేహితులతో చాలా సంతోషంగా గడిపిన నరేష్ ఉన్నట్టుండి ఇంత దారుణ స్థితిలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Published at : 07 Jun 2022 08:40 AM (IST) Tags: Khammam News Wyra News groom suicide Khammam suicide Khammam groom suicide

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

టాప్ స్టోరీస్

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!