News
News
వీడియోలు ఆటలు
X

Karimnagar Crime News : మ్యాచింగ్ సెంటర్‌లో గొడవ - భార్యను కత్తెరతో పొడిచిన భర్త !

భార్య, భర్తలు షాపింగ్‌కు వెళ్లారు. అదీ ఓ మ్యాచింగ్ సెంటర్‌కు. చివరికి భార్యను కత్తెరతో పొడిచేశాడు భర్త. లోపలేం జరిగిందంటే ?

FOLLOW US: 
Share:

Crime News :  ఆడవాళ్లతో షాపింగ్‌కు వెళ్తే మగవాళ్లకు ఎలాంటి నరకం ఉంటుందో చాలా సినిమాల్లో కామెడీగా చూపించారు. కానీ అలాంటి సీన్లు సీరియస్ అయితే ఎంత భయంకరంగా ఉంటాయో తాజాగా ఓ ఘటన చెబుతోంది. కరీంనగర్ టౌన్‌లో ఉన్న టవర్ సర్కిల్ మ్యాచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. ఈ ఏరియాలోఉన్న మయూరి మ్యాచింగ్ సెంటర్ కు ఇద్దరు భార్యభర్తలు వచ్చారు. ఏమయిందే ఏమో కానీ కాసేపటికి ఆ భార్య కడుపులో కత్తెర దిగింది. ఆమె అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. భర్త అక్కడ్నుంచి పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న ఆ మ్యాచింగ్ సెంటర్ నిర్వహకులు చెప్పిందేమిటంటే.. భర్తనే కత్తెర తీసుకుని భార్యను పొడిచి పారిపోయాడు.                                

దుకాణానికి వచ్చేంత వరకూ ఆ భార్యభర్తలు బాగానే ఉన్నారని.. అన్యోన్యంగానే ఉన్నారని  దుకాణం యజమానులు చెబుతున్నారు. అయితే.. షాపింగ్ ప్రారంభించిన  తర్వాత ఎంతకూ తనకు కావాల్సిన మ్యాచింగ్ దొరకలేదని చెప్పి అదే పనిగా ఆమె సమయం వేస్ట్ చేస్తూండటంతో భర్తకు కోపం వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరగా తేల్చాలని భర్త అంటూంటే.. నింపాదిగా ఆమె అన్ని మ్యాచింగ్ పీసులనూ చూస్తూండటంతో... భర్తకు కోపం వచ్చిందని అంటున్నారు. కోపం పట్టలేక అందుబాటులో ఉన్న కత్తెర తీసుకుని దాడి చేసినట్లుగా చెబుతున్నారు. భార్యకు కరెక్టుగా కడుపులో కత్తెర గుర్చుకుంది. రక్తస్రావం కారకుండా చున్నీ కట్టి వెంటనే ఆస్పత్రికి తరలించారు.                                            

భార్య భర్తల మధ్య వివాదాలు ఏమైనా ఉన్నాయా.. సందర్భాన్ని చూసుకుని హత్యకు ప్రయత్నించాడా అన్న  దానిపై పోలీసులు దర్యాప్తు   జరుపుతున్నారు.  అయితే తన భర్త వ్యతిరేకంగా ఆమె కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. తన భర్తకు షార్ట్ టెంపర్ అని ఆలస్యం అయినందు వల్ల కోపం తెచ్చుకుని దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ కేసు విషయం సంచలనం సృష్టించింది. ఖచ్చితంగా షాపింగ్ సెంటర్‌లో ఈ దాడి జరగడంతో... అదీ కూడా మహిళల దుస్తులు అమ్మే మ్యాచింగ్ సెంటర్‌లో దుకాణంలో జరగడంతో ఇక భర్తలతో పాటు అలాంటి షాపింగ్‌లకు వెళ్లకూడదన్న సైటైర్లు వినిపిస్తున్నాయి.                                     

ప్రస్తుతానికి ఆ భార్య ప్రాణానికి ఏం ప్రమాదం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.  దాడి చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                                         

Published at : 13 Apr 2023 03:54 PM (IST) Tags: Crime News Karimnagar Crime News Husband attacks wife with scissors

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు

Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు

Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి

Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి

స్వీట్‌లు, కేక్‌లు ఇష్టంగా తినేవారికి హెచ్చరిక- హైదరాబాద్‌లో నకిలీ దందా గుట్టురట్టు

స్వీట్‌లు, కేక్‌లు ఇష్టంగా తినేవారికి హెచ్చరిక- హైదరాబాద్‌లో నకిలీ దందా గుట్టురట్టు

టాప్ స్టోరీస్

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!