Love Affair: వేరొకరితో పెళ్లికి ప్రియురాలు సిద్ధం, జీర్ణించుకోలేక సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య
ఉద్యోగం రాలేదని కొందరు చనిపోతుంటే, ప్రేమించిన వారు మోసం చేశారని కొందరు లవర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ లో జరిగింది.
Youth Commits suicide due to Lover cheated on him : క్షణికావేశంలో యువత ప్రాణాలు కోల్పోతోంది. తాము ఏం చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా అని, తల్లిదండ్రుల ఆవేదన గురించి ఆలోచించకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం రాలేదని కొందరు చనిపోతుంటే, ప్రేమించిన వారు మోసం చేశారని కొందరు లవర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొబైల్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదంటూ సైతం ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ లో జరిగింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని, ఆ మోసాన్ని తట్టుకోలేక యువకుడు బలవన్మరణం చెందాడు.
అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా, చౌడపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం కలిసి షికార్లు చేశారు. ప్రేమలో ముగినితేలుతున్నా కెరీర్ మీద ఫోకస్ తప్పలేదు ప్రవీణ్. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఈవెంట్స్ సైతం పూర్తి చేసుకుని, మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. కానీ ఈ క్రమంలో ప్రేమించిన యువతి ప్రవీణ్ ను మోసం చేసింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మోసం చేసి వేరే అబ్బాయి సన్నిహితంగా ఉంటూ అతడితో వివాహానికి సిద్దమైంది. ఈ విషయాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు.
సెల్ఫీ వీడియో, ఆత్మహత్య..
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురై పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ప్రవీణ్. ఇక జీవితం వద్దనుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ప్రవీణ్. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ తో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు.
వారిద్దరినీ శిక్షించండి..
తనను మోసం చేసిన యువతితో పాటు తన ఆత్మహత్యకు కారణం అయిన ప్రియురాలిని వివాహం చేసుకోబోయే వ్యక్తి (వియజ్ భాస్కర్)ని కఠినంగా శిక్షించాలని విడియోలో డిమాండ్ చేశాడు ప్రవీణ్.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..
నాన్నమ్మకి, శారదకి, దుర్గ, జమున, భీమాజీ, పాండు.. కుటుంబసభ్యులు అందరికీ ఇవే నా చివరి మాటలు. నేను గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నాకు అమ్మ ప్రేమను, నాన్న ప్రేమను చూపించినట్లుగా నటించి, చివరికి నన్ను మోసం చేసింది. ఆ అమ్మాయితో నా జీవితం మొత్తం ఊహించుకున్నాను. ఇప్పుడు తను నాకు దక్కదు అని జీర్ణించుకోలేకపోతున్న. దయచేసి నన్ను క్షమించింది.
మన భూమి అమ్మిన తరువాత జమునకు రూ.30 లక్షలు ఇవ్వడం, మిగతా డబ్బులు దుర్గ, శారదను సమానంగా తీసుకోమని చెప్పండి. మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు నన్ను క్షమించిండి. మిస్ యూ ఫ్రెండ్స్. దయచేసి మీరంతా నా చివరి చూపు చూడటానికి రండి లవ్ యూ గుడ్ బాయ్ అని చనిపోయేముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ లో ఈ విషయాలు పేర్కొన్నాడు.