Hyderabad Crime : స్మశానంలో సగంకాలిన మృతదేహం, పక్కనే క్షుద్రపూజల ఆనవాళ్లు!
Hyderabad Crime : హైదరాబాద్ లో కె.పి.హెచ్.బి పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసిన స్మశానంలో తగులబెట్టేందుకు దుండగులు ప్రయత్నించారు.
Hyderabad Crime : హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి తగులబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదర్ నగర్ లోని అలీ తలాబ్ స్మశాన వాటిక వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హత్య చేసి శవాన్ని తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.
అసలేం జరిగింది?
ఓ గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి తగుల బెట్టిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ అలీ తాలబ్ వద్ద చెరువు ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం తగులబడిన స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి హంతకులు ఈ వ్యక్తిని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృత దేహం వద్ద లభించిన ఓ సెల్ ఫోన్, బ్యాగును స్వాధీనం చేసుకుని, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడిని సంఘటనా స్థలంలోనే హత్య చేసి తగులపెట్టారా లేదా వేరే చోట హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి తగులపెట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెరువు పక్కనే స్మశానం ఉండటంతో, అక్కడ పలు పూజలు చేసిన ఆనవాళ్లు ఉండగా స్థానికులు క్షుద్ర పూజలు చేసి ఈ హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం ఆ పూజలకు, హత్యకు సంబంధం లేదని తెలిపారు.
సీఐ ఏమన్నారంటే?
అలీ తలాబ్ చెరువు స్మశాన వాటిక వద్ద ఉదయం గుర్తు తెలియని మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. స్థానికులు, కాటికాపరి ఉదయం మృతదేహాన్ని గమనించి కేపీహెచ్ బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో మృతదేహం 60 శాతం కాలిన స్థితిలో ఉంది. మృతదేహానికి సమీపంలో బియ్యం, దారం, పిండి, నాణేలు కనిపించినట్లు కాటికాపరి తెలిపారు. ఈ విషయమై కేపీహెచ్ బీ సీఐ కిషన్ కుమార్ మాట్లాడుతూ కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామని మృతదేహం సమీపంలో బ్యాగు ఒక ఫోన్ గుర్తించామన్నారు. క్షుద్ర పూజలు పూజలు జరిగినట్లు ఆనవాళ్లు లేవని, సమీపంలో దినకర్మ లాంటివి జరిగాయని , సంఘటన స్థలాన్ని గమనిస్తే తెలుస్తుందన్నారు.
Also Read : Venkata Sanjana Kidnap Case: బద్వేల్ విద్యార్థిని కిడ్నాప్ కేసు సుఖాంతం, మహిళా కిడ్నాపర్ అరెస్ట్!