అన్వేషించండి

Hyderabad Crime : అర్ధరాత్రి వరకూ సెల్ ఫోన్ మాట్లాడుతున్న కుమార్తె, గొంతు నులిమి హత్య చేసిన తండ్రి

Hyderabad Crime : హైదరాబాద్ ముషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందని కుమార్తెను హత్య చేశాడు తండ్రి.

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం జరిగింది. సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని కూతుర్ని హత్య చేశాడు సవతి తండ్రి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సవతి తండ్రి కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆ దారుణానికి పాల్పడ్డాడు. యాస్మిన్ ఉన్నిసా (17)ను సవతి తండ్రి సాదిక్  గొంతు నులిమి హత్య చేసిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని బాకారంలో వెలుగుచూసింది. యాస్మిన్ తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు సాదిక్.  కూతురిని చంపిన అనంతరం నిందితుడు మహమ్మద్ తౌ ఫి అలియాస్ సాదిక్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. యాస్మిన్ ఉన్నిసా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. 

ఝార్ఖండ్ లో దారుణం 

ఝార్ఖండ్‌లో శ్రద్ధ తరహా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సాహిబ్‌గంజ్‌ జిల్లాలో గిరిజన తెగకు చెందిన ఓ వ్యక్తి తన రెండో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.  శవాన్ని 18 ముక్కలు చేశాడు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరి కొన్ని వివరాలు వెల్లడించారు. "22 ఏళ్ల మహిళ మృత దేహానికి సంబంధించిన 12 శరీర భాగాలను గుర్తించాం. తలతో సహా మిగతా శరీర భాగాలు ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు దిల్దార్ అన్సారీని అదుపులోకి తీసుకున్నాం" అని చెప్పారు. సంతాలి మోమిన్ తోల ప్రాంతంలో కొన్ని శరీర భాగాలు గుర్తించామని స్పష్టం చేశారు. బాధితురాలు రూబికా పహదిన్‌...నిందితుడికి రెండో భార్య అని తెలిపారు. రెండేళ్లుగా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఉందని,మృతురాలి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా...రూబికా హత్యకు గురైందని తేలింది. శవాన్ని కట్ చేసేందుకు ఎలక్ట్రిక్ కట్టర్‌ లాంటి పదునైన ఆయుధాన్ని వినియోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ప్రతిపక్షాల ఆరోపణలు 

అటు రాజకీయంగానూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో  విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. "హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో బాలికలు, యువతులపై ఇలాంటి దారుణాలెన్నో జరుగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందినకొందరు వ్యక్తులు కావాలనే మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకుండా ఉంటే...మేమే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాం" అని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ అన్నారు. 

రాజస్థాన్ లో మరో ఘటన 

రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ దిగ్భ్రాంతి కలిగించే ఘటన జరిగింది. విద్యాధర్ నగర్ ప్రాంతంలోని లాల్ పురియా అపార్ట్ మెంట్ సెక్టార్ - 2 లో ఈ నెల 11వ తేదీన అనుజ్ అనే వ్యక్తి 64 ఏళ్ల సరోజ్ శర్మ అనే తన మేనత్తను హత్య చేశాడు. తలపై సుత్తితో కొట్టి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తన బాత్ రూమ్ లో మార్బుల్ కట్టర్ మిషన్ ను ఉపయోగించి మృతదేహాన్ని పది ముక్కలుగా చేశాడు. ఆపై వాటిని అడవిలో పలు ప్రాంతాల్లో పాడేశాడు. ఆ తర్వాత తనకు ఏం తెలియదన్నట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్త అదృశ్యం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి వెళ్లిన అనుజ్.. వంట గదిలో ఉన్న రక్తపు మరకలను చూశాడు. వెంటనే వాటిని కడిగేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మృతురాలు కూతురు పూజ అక్కడకు వచ్చింది. అతడు రక్తపు మరకలు కడిగేయడాన్ని గుర్తించింది. వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపింది. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు అనుజ్ ను అరెస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Embed widget