అన్వేషించండి

School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా, డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం! 

Bus Boltha: గుంటూరు జిల్లా దంతులూరు వద్ద రోడ్డు చిన్నగా ఉండడంతో ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. 

Bus Boltha: గుంటూరు జిల్లా కల్లిపర మండలం దంతలూరు గ్రామ శివారు వద్ద ఉన్న రోడ్డు చాలా చిన్నగా ఉంది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న తెనాలి నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ నలుగురు విద్యార్థులకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పిల్లలను కిందకు దింపారు. ఘటనలో గాయపడ్డ విద్యార్థులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. 

చిన్న రోడ్డు.. అది చాలదన్నట్లు పక్కనే కాలువ!

దంతలూరు గ్రామానికి 7.30 గంటలకు వచ్చిన బస్సు.. పిల్లలను ఎక్కించుకొని పాఠశాలకు బయలు దేరింది. ఈ క్రమంలోనే గ్రామ శివారు దాటేటప్పుడు బస్సు ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం వ్షం కురవడం, పక్కనే కాలువ ఉండటం.. అది చాలదన్నట్లు రోడ్డు చిన్నగా ఉండడంతోనే ప్రమాదం జరగిందని పాఠశాల బస్సు డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా పడినప్పటికీ.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పిల్లల ప్రాణాలు కాపాడగల్గినట్లు స్థానికులు చెబుతున్నారు. 

డ్రైవర్ వల్లే మా పిల్లల ప్రాణాలు దక్కాయి..

గత కొంత కాలంగా రోడ్డును పెద్దగా చేయాలని అధికారులకు విన్నవవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈరోజు ఏమైనా జరిగి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చేదని అంటున్నారు. దాదాపు 25 కుటుంబాలు తమ పిల్లలను కోల్పోవాల్సి వచ్చేదని.. అందరి అదృష్టం బాగుండటం వల్లే పిల్లల ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. చిన్నగా ఉన్న ఆ రోడ్డపై వెళ్లాలంటే ఆటో డ్రైవర్లు కూడా చాలా భయపడుతున్నారని గ్రామస్థులు వివరించారు.

ఇప్పటికైనా పట్టించుకోండయ్యా..! 

రోడ్డు విస్తరణ పనులు చేపట్టే వరకు తమ పిల్లలను బడికి పంపించలేమని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని అంటున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై చాలానే ప్రమాదాలు జరిగాయని చెప్పారు. అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు స్పందించరేమో అంటూ మండి పడుతున్నారు. ఎన్నికల అప్పుడు వచ్చి హామీలు ఇచ్చే నాయకులు.. ఇప్పుడు ఏమైపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక ముందే రోడ్డును విస్తరించమని ప్రాధేయ పడుతున్నారు. రోడ్డు పనులు చేస్తామని హామీ ఇచ్చే వరకు గ్రామంలోకి ఏ నాయకులు, అధికారులు వచ్చినా ఊరుకోమని చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Embed widget