అన్వేషించండి
Advertisement
Hyderabad News: హిట్ అండ్ రన్ కేసు - బాధితున్ని ఆస్పత్రిలో చేర్చి వైద్యుడు పరారీ
Hit And Run Case: ఓ వైద్యుడు కారును వేగంగా నడిపి తోపుడు బండ్లపై పోనిచ్చాడు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, తన ఆస్పత్రిలో చేర్పిస్తానని నమ్మించి వేరే ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు.
Hit And Run Case in Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట హిట్ అండ్ రన్ (Hit And Run) ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం ఉదయం బొల్లారం (Bollaram) పరిధిలోని ఓ ప్రమాదం జరిగింది. ఓ వైద్యుడు కారును వేగంగా నడుపుతూ వచ్చి తోపుడు బండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతని కారును వెంబడించి పట్టుకున్నారు. ఆయన నగరంలో ఓ ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్ అని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో సయ్యద్ షాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. తన ఆస్పత్రిలోనే బాధితునికి చికిత్స అందిస్తానని చెప్పి కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని.. బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు వాపోయారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion